Kakani Govardhan Reddy: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే పొలిటికల్ జోకర్‌గా మారారని అనిపిస్తోందని విమర్శించారు. చంద్రబాబుతో చేరడంతో పవన్ కళ్యాణ్‌కు కూడా మతిమరుపు వ్యాధి వచ్చినట్లుందన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారని.. పవన్ ప్యాకేజీల పవన్‌గా మారిపోయారని మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో జగన్ ప్రతిపక్ష…
CM Jagan: ఏపీ సీఎం జగన్ ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో థర్మల్ పవర్ స్టేషన్‌లోని మూడో యూనిట్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్‌లోని మూడో యూనిట్ పూర్తి సామర్థ్యం 800 మెగావాట్లు అని అధికారులు వెల్లడించారు. అయితే సీఎం జగన్ పర్యటనను…
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక నుంచి ఏపీలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్‌కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ, శైలజానాథ్, రఘువీరారెడ్డి, సుబ్బరామిరెడ్డి, తులసిరెడ్డి, రుద్రరాజు, కనుమూరి బాపిరాజు సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొన్నారు. ఈరోజు నుంచి ఈనెల 21 వరకు నాలుగు రోజుల పాటు 119 కిలోమీటర్ల మేర ఏపీలో రాహుల్ గాంధీ…
What’s Today: • ఢిల్లీ: నేడు ఉదయం 10:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం.. కేబినెట్‌తో పాటు ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ • నేటి నుంచి ఏపీలో నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఏపీలో 119 కి.మీ పాటు సాగనున్న రాహుల్ పాదయాత్ర.. ఈరోజు లంచ్ బ్రేక్ సమయంలో పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులతో భేటీ కానున్న రాహుల్ గాంధీ • అమరావతి: నేడు జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో…
జనసేనపై కుట్ర చేస్తున్నారు.. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.. ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న పవవన్ కల్యాణ్‌ను నోవాటెల్ హోటల్లో కలిసిన ఆయన.. విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై, ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు ఆ తర్వాత ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు ఇద్దరు నేతలు.. తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో…
నెల్లూరు నగరంలోని పలు బంగారం దుకాణాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వ్యాపారానికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు నుంచి 40 మంది అధికారులు ఏక కాలంలో నెల్లూరు సిటీలోని 15 ప్రాంతాలపై దాడులు నిర్వహించారు.. రికార్డులను పరిశీలించి, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.. కాగా, మరోవైపు ఇవాళ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంబీఎస్ జ్యువెల్లర్స్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఎంబీఎస్ జ్యువెల్లర్స్‌తో పాటు ముసదిలాల్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని.. విశాఖలో పవన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, పవన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఆయన.. పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలే మళ్లీ మళ్లీ వల్లేస్తున్నారు.. నీ సినిమా డైలాగులుకు, ఎవరో రాసిస్తే మాట్లాడే మాటలకు మా కార్యకర్తలు భయపడరు.. ఇది సినిమా కాదు.. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అట్టుకు 10 అట్లు పెడతాం… వాయినానికి పది వాయినాలు…
అనంతపురం జిల్లా పోలీసులు మరో అరుదైన రికార్డ్ సాధించారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా కేవలం వాట్సప్ ఫిర్యాదుతో ఏకంగా 3 వేల సెల్ ఫోన్లు రికవరీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనంతపురం జిల్లా పోలీసులు ఒక వినూత్న సర్వీస్ కు శ్రీకారం చుట్టారు. చోరీకి గురైన ఫోన్లు, లేదా పొగుట్టుకున్న ఫోన్ల కోసం చాలా మంది బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేవారు. ఫిర్యాదు చేసినా అవి ట్రేస్ కాక ఇబ్బంది పడే…
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఓ భక్తుడు కలకలం సృష్టించారు… తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్య ఒత్తిడితో మొత్తానికి మందు మానేయలనే నిర్ణయానికి వచ్చాడు.. కాణిపాకంలో గణపతి సాక్షిగా మందు మానేయాలని భావించిన ఆయన.. ఇదే మందు తాగడం చివరి సారి అనుకున్నాడో ఏమో.. కానీ, ఫుల్ట్‌గా మందు కొట్టి వచ్చాడు.. దేవుడు దగ్గర మద్యం మానేయటం కోసం వచ్చిన ఆ భక్తుడు… భార్య కోరిక మేరకు మద్యం మానేస్తానంటూ ప్రమానం చేసేందుకు సిద్ధం అయ్యారు..…
రాజకీయాల నుంచి క్రిమినల్స్‌ను తీసివేయాలన్నది మా లక్ష్యం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… వైజాగ్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయన.. ఆ తర్వాత మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. అక్కడ మీడియాతో మాట్లాడిన పవన్.. తన వైజాగ్ పర్యటనపై ఘాటుగా స్పందించారు.. వైసీపీకి పోటీగా కార్యక్రమం పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేసిన పవన్.. మేం నిర్మాణాత్మకంగానే మా విమర్శలు ఉంటాయి.. ఒక రాజకీయ పార్టీగా అది మా…