Andhra Pradesh: ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల ఉపకార వేతనం (స్టైఫండ్) పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ.44వేల నుంచి రూ.50,686కు, సెకండియర్ విద్యార్థులకు రూ.46వేల నుంచి రూ.53 వేలకు, థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973 నుంచి రూ.56,319కు, ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589 నుంచి రూ.22,527కు స్టైఫండ్ పెంచింది. వివిధ క్యాటగిరీలు, చదువుతున్న సంవత్సరాలను బట్టి స్టైఫండ్లో పెంపుదల ఉంటుందని…
అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రపై కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. అమరావతి నుంచి అరసవల్లి వరకూ చేపట్టిన మహాపాదయాత్రలో ఉద్రిక్తతలు తలెత్తుతున్న నేపథ్యంలో.. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.. అయితే, మేం ఇచ్చిన ఆదేశాలకు లోబడే అమరావతి మహాపాదయాత్ర జరగాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది… పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది హైకోర్టు.. ఎవరైనా పాదయాత్రకు…
ఏపీ సీఎం వైఎస్ జగన్ పిల్లా కాదు.. పులి… పిల్లికి, పులికి తేడా తెలియకపోతే ఆహారం అయిపోతావు అంటూ నారా లోకేష్ని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. గుడివాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. లోకేష్ ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని నోరు పారేసుకున్నాడని.. జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదు ఈ పిచ్చి నా కొడుక్కి అంటూ ఫైర్ అయ్యారు. ఇక, పిల్లికి, పులికి తేడా తెలియకపోతే ఆహారం…
దాదాపు 20 మంది స్కూల్ విద్యార్థులు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లాలో ఇవాళ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది.. సఖినేటిపల్లి నుంచి నరసాపురం వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు.. మలికిపురం మండలం దిండి గ్రామంలో ప్రమాదం జరిగింది.. వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్, స్కూల్ బస్సును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సు నుజ్జునుజ్జు అయ్యింది… ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుండగా.. నలుగురు విద్యార్థులకు…
ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టించింది… కృష్ణా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.. విజయవాడ నుండి గుడివాడ వెళ్తున్న గుడివాడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు.. పెదపారుపూడి మండలం పులవర్తి గూడెం సమీపానికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది.. ఒక్కసారిగా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి… నిమిషాల వ్యవధిలో బస్సు మొత్తం వ్యాపించాయి.. ప్రమాద సమయంలో దాదాపు 40 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేస్తున్నారు.. మంటలు చెలరేగడంతో.. ఆందోళనకు గురైన.. కేకలు…
పోలీసులకు వీక్లీ ఆఫ్ ఉండాలనేది నా మనస్సులో మాట.. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా వీక్లీ ఆఫ్ అమలు చేయలేకపోయాం.. దీనిని దృష్టిలో పెట్టుకునే 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం వైఎస జగన్
కలియుగ ప్రత్యక్ష దైవం, కొలిచినవారి కొంగుబంగారం శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామివారి భక్తులకు శుభవార్త… నవంబర్ మాసానికి సంబంధించిన శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లు, డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది టీటీడీ.. నవంబర్ మాసానికి సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటా ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్న తిరుమల తిరుపతి దేవస్థానం.. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను కూడా ఇవాళ మధ్యాహ్నం…
ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర ముగించుకుని.. మరోసారి కర్ణాటకలో అడుగుపెట్టబోతున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తుంగభద్ర డ్యామ్ మధ్యలో ఏపీ సరిహద్దు ముగిసి.. కర్ణాటక సరిహద్దులోకి ప్రవేశించనున్నారు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ లో అంతర్గత ప్రజా స్వామ్యం ఎంత బలంగా ఉందొ అనేది ఖర్గే ఎన్నిక నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ట్రాక్ రికార్డ్ ఉన్న నాయకుడు అధ్యక్షుడు కావడం గర్వ కారణమని అన్నారు.