Fame Turns to Jail: సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో రెచ్చిపోయిన ఇద్దరు యువకులు కటకటాల పాలయ్యేలా చేసింది. ఇంస్టాగ్రామ్లో వీడియోలు చేసేందుకు పోలీస్ స్టేషన్నే టార్గెట్ చేసి.. హింసాత్మక డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
Tirupati: తిరుపతిలోని శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న ఓ షాపు కాంట్రాక్టు తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (ఆగస్టు 7న) గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
కోటగిరి శ్రీధర్... వారసత్వంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ నాయకుడు 2019లో ఫస్ట్ టైం వైసీపీ తరపున ఏలూరు ఎంపీ అయ్యారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనే స్వచ్చందంగా బరి నుంచి తప్పుకున్నారు. ఎందుకలా.... అంటే, అమెరికాలో ఉన్న కుటుంబానికి దూరంగా ఉండలేకపోతున్నానన్నది ఆయన సమాధానం.
తెలుగుదేశం పార్టీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్ఛాపురం. ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున హ్యాట్రిక్ కొట్టారు ఎమ్మెల్యే బెందాళం అశోక్. ప్రస్తుతం ప్రభుత్వ విప్ పదవిలో కూడా ఉన్నారాయన. అయితే... ఇన్నేళ్ళ సంగతి ఎలా ఉన్నా... ఇప్పుడు మాత్రం ద్వితీయ శ్రేణి నాయకులే ఆయన మీద గుర్రుగా ఉన్నారట. అదే సమయంలో ఇన్నిసార్లు గెలిపిస్తే.. నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారు సార్.. అన్న ప్రశ్నలు సైతం ప్రజల నుంచి మొదలవుతున్నాయి.
వైసీపీ మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే... గుమ్మనూరు జయరాం, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటోంది. పార్టీలు మారినా... వాళ్ళ వివాదాస్పద తీరు మాత్రం మారదా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. నిత్య వివాదం లేకుంటే వీళ్ళకు నిద్ర పట్టదా అని కూడా మాట్లాడుకుంటున్నారట.
ఇల్లు అలకగానే పండగ కాదు.. రేపు మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మీకు ఏ ఖర్మ పడుతుందో మీరే ఆలోచించుకోండి అంటూ హెచ్చరించారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకి వయసు పెరిగే కొద్దీ ఆలోచనా సరళి కుంచిత పోకడలు పెరిగిపోతున్నాయి. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాల్సిన అవసరం ఉంది. కానీ, పులివెందుల జడ్పీటీసీకి మాత్రమే బై ఎలక్షన్ పెట్టాడు అని దుయ్యబట్టారు..