తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం దుప్పలపూడి గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన కలకల రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. దుప్పలపూడి గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్న మైనర్ బాలిక (16) కు వ్యాన్ డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మాయ మాటలతో ఆ బాలికను లోబరుచుకున్నాడు. ఈనెల తొమ్మిదో తారీఖున అర్ధరాత్రి సమయాన బాలికను బైక్ పై అపహరించుకుపోయాడు వ్యాన్ డ్రైవర్.
Also Read:Supreme Court : పర్యావరణాన్ని రక్షిస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తాం
తమ కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు అనపర్తి పోలీసులు. ఆ తర్వాత బాలిక ఆచూకీ కనుగొని అదుపులో తీసుకున్నారు. బాలిక ఇచ్చిన సమాచారం ప్రకారం శారీరకంగా అనుభవించినట్లు తెలియడంతో వ్యాన్ డ్రైవర్, పోతుల దుర్గాప్రసాద్ పై కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేశారు. నిందితుడు కోసం గాలిస్తున్నామని త్వరలోనే అరెస్ట్ చేస్తామని అనపర్తి ఎస్సై శ్రీనివాస్ నాయక్ తెలిపారు.