JTC Venkateswara Rao: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్‌కు అసలైన పండుగ.. ప్రయాణికులను రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీగా చార్జీలు పెంచి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాయి.. అయితే, పండుగ సమయంలోనూ సాధారణ చార్జీలే వసూలు చేస్తోంది ఆర్టీసీ.. అదే సమయంలో.. ఒకేసారి అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్చేసుకునేవారికి రాయితీ కూడా కల్పిస్తోంది. అయితే, ఈ ఏడాది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలను భారీ పెంచే అవకాశం ఉండడంతో.. అప్రమత్తం అయ్యారు…
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒక్కటే.. పేర్లే వేర్వేరు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పేర్లే వేర్వేరు.. కానీ, మనుషులు ఇద్దరు ఒక్కటేనని ఆరోపించారు మంత్రి విడదల రజినీ…. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయనేది వాళ్లు కలిసి చేస్తున్న దుష్ప్రచారమని తిప్పికొట్టిన ఆమె.. కందుకూరు, గుంటూరులో ప్రాణాలు కోల్పోయిన బాధితులను పరామర్శించ కుండా.. పవన్, చంద్రబాబు ఒకరిని ఒకరు పరామర్శ చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు. ఇక, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి తీరుతాం..…
Vidadala Rajini: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందిస్తోంది.. ఇప్పటికే మంత్రులు, వైసీపీ నేతలు.. ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు సందిస్తున్నారు.. 11 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన చంద్రబాబును పవన్ కల్యాణ్ పరామర్శించడం ఏంటి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.. తాజాగా, ఈ ఎపిసోడ్లో మంత్రి విడదల రజినీ హాట్ కామెంట్లు చేశారు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు,…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అవసరం లేదు.. ఎందుకంటే.. ఇద్దరు కలిసే సంసారం చేస్తున్నారు.. కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబేనంటూ ఆరోపణలు గుప్పించారు.ర. తమ అపవిత్ర కలయికకు పవిత్రత తీసుకువచ్చేందుకు నిన్న సమావేశం అయ్యారని సెటైర్లు వేసిన ఆయన.. చంద్రబాబు…
YSRCP: వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి ఇవాళ్టికి నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. జగన్…
Andhra Pradesh Winter: దక్షిణ భారతదేశం మొత్తం చలి విజృంభిస్తోంది. దీంతో సాధారణం కంటే కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో చలి తీవ్రస్థాయిలో ఉంది. చింతపల్లిలో ముఖ్యంగా 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు హుకుంపేటలో 2.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏజెన్సీలోని లంబసింగి వంటి కొన్ని ప్రాంతాల్లో…
Andhra Pradesh: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డికి జిల్లా కలెక్టర్ షాక్ ఇచ్చారు. ఆయన్ను జిల్లా నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ కలెక్టర్ గిరీష ఆదేశాలు జారీ చేశారు. కురబలకోటలో జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన కొండ్రెడ్డికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎస్పీ సమర్పించిన నివేదిక ఆధారంగా కొండ్రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. కొండ్రెడ్డిని తరచూ గొడవలకు దిగే…
Nellore District: నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ వివాదం కలకలం రేపుతోంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తమను నమ్మించి మోసం చేశారని శివచరణ్‌రెడ్డి తల్లి లక్ష్మీదేవి ఆరోపించారు. ఇటీవల తనకు కొడుకు ఎవరూ లేరని చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ‘నేను ఎవరిని?’ అంటూ శివచరణ్ రెడ్డి ఒక లేఖను విడుదల చేయడంతో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో చిన్నతనంలో తీసుకున్న ఫోటోలను విడుదల చేశారు. శివ చరణ్ రెడ్డితో తనకు ఎలాంటి…