Somu Veerraju: అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2023-24పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.. అప్పులను ఆదాయంగా చూపించ కూడదని ఆర్బీఐ చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా అసెంభ్లీసాక్షిగా ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెల గారిడీతో మాయ చేశారు. ఆయన అందుకు విదేశీ ప్రముఖల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బడ్జెట్ కు తనవాదనలను సమర్ధించుకుంటూ రాష్ట్రప్రజలకు అవాస్తవాలను శాసన సభలో వెల్లడించారని తప్పుపట్టారు. కేంద్ర నిధులు, పథకాలను కూడా…
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయులు, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు.
Somu Veerraju: జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పొత్తులపై ఆసక్తికర కామెంట్లు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇక, పవన్ కల్యాణ్ కామెంట్లపై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. కృష్ణా జిల్లా గుడివాడలో జిల్లా స్థాయి భారతీయ జనతా పార్టీ బూత్ స్వశక్తి కిరణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన, తెలుగుదేశం…
Vizag Capital: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. జులై నుంచి విశాఖకు వెళ్తున్నామని మంత్రులకు చెప్పారు సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆమోదించాల్సిన బిల్లుల కోసం కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అధికారికంగా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం.. విశాఖ నుంచి పరిపాలన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.. ఉగాది నుంచి సీఎం జగన్ .. విశాఖకు వెళ్తారని అక్కడి…
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో 1,610 పోస్టుల భర్తీ..! నిరుద్యోగులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే పలు శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఇప్పుడు వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టుల భర్తీకి సిద్ధమైంది.. ఆ శాఖలో కొత్తగా 1,610 పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం..…
తన నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీ వేదికగా నిరసన తెలుపుతున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత ఆయన వైసీపీకి దూరమైయ్యారు. తన నియోజవకర్గంలోనే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన వ్యక్తి చేశారు.
Botsa Satyanarayana: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులకు బహిరంగ సవాల్ విసిరారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రశ్నోత్తరాల సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకు 29కి పడిపోయిందని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆరోపించారు.. అయితే, టీడీపీ ఆరోపణలను ఖండించిన మంత్రి బొత్స… నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అంటూ ప్రకటించారు.. రాష్ట్రంలో పాఠశాలలు మూతపడ్డాయన్న టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు వ్యాఖ్యలను ఖండించిన బొత్స సత్యనారాయణ..…