Gannavaram Airport: ఎయిరిండియా నిర్వాకం.. గన్నవరంలో ఇరుక్కుపోయిన కువైట్ ప్రయాణికులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gannavaram Airport: మరోసారి ఎయిరిండియా నిర్వాకం విదేశీ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది.. నేటి నుండి గన్నవరం-కువైట్ విమాన సర్వీసు ప్రారంభం అయిన విషయం విదితమే.. విజయవాడ నుండి నేరుగా కువైట్ కు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చేసింది.. ప్రతి బుధవారం గన్నవరం నుండి కువైట్‌కు విమానం బయల్దేరనుంది ఈ విమానం.. షెడ్యూల్ ప్రకారం ప్రతి బుధవారం ఉదయం 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్ చేరుకుంటుంది.. ఇక, కువైట్‌లో సాయంత్రం 3.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.35 గంటలకు తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకోనుంది ఎయిరిండియా విమానం. ఇంత వరకు బాగానే ఉన్న ఎయిరిండియా చేసిన పొరపాటు ఇప్పుడు ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంది.
Read Also: Traffic changed: రేపు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఇదే
Also Read
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
విజయవాడ నుంచి కువైట్‌కు విమానసర్వీసులు ప్రారంభమైన తొలిరోజు ఎయిరిండియా నిర్లక్ష్యంతో 11 మందికి పైగా ప్రయాణికులు వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.. విమానం ఉదయం 9.55కు బయల్దేరాల్సి ఉండగా.. వారికి ఇష్యూ చేసిన టికెట్లలో మాత్రం మధ్యాహ్నం 1.10 గంటలకు అని పేర్కొంది ఎయిరిండియా.. టికెట్లపై మధ్యాహ్నం 1.10 గంటలకు విమానం అంటూ ముద్రించారు.. గన్నవరం నుండి కువైట్‌కు 85 మంది ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోగా.. విమానం బయల్దేరే సమయానికి 67 మంది ప్రయాణికులు మాత్రమే గన్నవరం చేరుకుని కువైట్ వెళ్లిపోయారు.. టికెట్‌పై మధ్యాహ్నం 1.10 అని ఉండడంతో ఆలస్యంగా 11 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.. మరికొంత మంది ప్రయాణికులు కూడా గన్నవరం చేరుకుంటున్నారు.. విమానం వెళ్లిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ప్రయాణికులు ఎయిరిండియా తప్పదంపై ప్రశ్నించగా డబ్బులు రీఫండ్ చేస్తామని సిబ్బంది చెప్పడంతో.. ఎయిరిండియా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ప్రయాణికులు..
తాజావార్తలు
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!