* అమరావతి: నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి
* హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ సభ
* నేడు భద్రాచలం రామాలయంలో ఎదుర్కోలు ఉత్సవం.. రేపు సీతారాముల కళ్యాణం..
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం.. రేపు సాయంత్రం హనుమంత వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం
* ఒంగోలు: నేడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో వెలిగొండ ప్రాజెక్టు పై సదస్సు. పాల్గొననున్న తులసి రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర నేత పి.మధు..
* ప్రకాశం : టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు..
* ప్రకాశం : అర్ధవీడులో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.
* శ్రీ సత్యసాయి : నేడు పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర.. నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమై.. సోమందేపల్లి, వెంకటాపురం తండా మీదుగా పెనుకొండ వరకు సాగనున్న పాదయాత్ర.
* ఏలూరు జిల్లా: నేడు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం..
* పశ్చిమగోదావరి జిల్లా: మార్టేరు వరి పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళ.. కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి కాకాని గోవర్ధన్ ..
* కాకినాడ: అన్నవరంలో నేటి నుంచి శ్రీ రామ నవమి వేడుకలు.. రత్నగిరి క్షేత్ర పాలకుడుగా సీతారామచంద్రస్వామి.. రేపు ఆలయంలో సీతా రాములు కల్యాణం.. వచ్చే నెల 7న జరిగే పుష్పయాగంతో వేడుకలు ముగింపు
* నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ.. జిల్లెల్లమూడి విశ్వజనని పరిషత్ ట్రస్ట్ ను సందర్శించనున్న దత్తాత్రేయ.. దేవస్థానం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న హర్యానా గవర్నర్
* కడప : ఈనెల 31న జిల్లా కేంద్రంలో ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా..
* కడప: రేపటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామస్వామి శ్రీరామనవమి బ్రంహోత్సవాలు.. ఏప్రిల్ 5న జరిగే కల్యాణోత్సవానికి హాజరు కానున్న సీఎం వైఎస్ జగన్..
* భూపాలపల్లి: కాళేశ్వరంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నేటి నుండి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. సాయంత్రం అధ్యాయనోత్సవం, ప్రబంధ పారయణం, చాత్మర ఎదురుకోలు సేవా. రేపు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్న అర్చకులు.