Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమంటూ ఇప్పటికే ప్రకటించింది బీఆర్ఎస్, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు.. ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననున్నట్టు తెలుస్తోంది.. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారట.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు ఓ వైపు ఉద్యమాలు చేస్తుండగానే కేంద్రం మాత్రం దానిని విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. ఉక్కు…
Mass Copying: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల మాస్ కాపీయింగ్ కలకలం సృష్టిస్తోంది.. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు జగ్గయ్యపేటలో పరీక్షలకు హాజరవుతున్నారు.. ముడు సెంటర్లలో దాదాపు 700 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.. జగ్గయ్యపేట ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. అయితే, ఓపెన్ ఇంటర్ పరీక్షల లో జవాబు పత్రాలు అందిస్తామంటూ విద్యార్థికి రూ.15 వేల నుంచి 25 వేల రూపాయల వరకు…
బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీకి కీలక పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. శుక్రవారం బీజేపీ పెద్దల సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో బిజీబిజీగా గడపుతున్నారు. బీజేపీ అగ్రనేతలతో వరుసగా భేటీలు అవుతున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సాయంత్రానికి సోము వీర్రాజు ఢిల్లీకి చేరుకోనున్నారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరిక సందర్భంగా నిన్ననే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేకుండాపోయింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో కూడా పోటీ పడే పరిస్థితి లేదు. రాష్ట్రంలో రాజకీయంగా ఉనికిలో లేకపోయినా.. ఆపార్టీకి సంబంధించిన కార్యాలయాలు మాత్రం అలాగే ఉన్నాయి.
Rare Earth Elements Reserve In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన మూలకాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జిఆర్ఐ) శాస్త్రవేత్తలు పరిశోధించగా అక్కడి నేలల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కనుగొన్నట్లు వెల్లడించారు.