Yerragondapalem: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్థానిక ఇజ్రాయెల్ పేటలో ఇరువర్గాల ఘర్షణకు దిగాయి.. దీంతో మహిళలు సహా పది మందికి పైగా గాయాలయ్యాయి. గ్రామంలోని పోలేరమ్మ ఆలయానికి ముందు కాలనీ పేరిట ఆర్చి నిర్మానానికి ఏర్పాట్లు చేయటంతో వివాదం తలెత్తింది. ఆర్చి నిర్మాణాన్ని మరో వర్గం వ్యతిరేకిస్తుండటంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి యత్నించారు.. రాళ్ళ దాడిలో కానిస్టేబుల్ కి తీవ్రగాయలు కావటంతో హాస్పిటల్ కి…
former MLA Neeraja Reddy Died in road accident: కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి మరణించారు. గతంలో నీరజా రెడ్డి ఆలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. కారు టైర్ పేలడంతో ఫార్చూనర్ కారు ప్రమాదానికి గురైంది.
TTD Governing Body: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. శ్రీవారి నైవేధ్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు.. అన్నప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదానికి కూడా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు ధరల నిర్ణయానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్న…
తెలంగాణ ప్రభుత్వం చొరవ అభినందనీయం.. అప్పుడే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-EOIకి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది.. అయితే, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు EOIకి వచ్చినప్పుడే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం అంటున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపించిన చొరవ అభినందనీయమన్న ఆయన… EOIలో భాగస్వామ్యం అవుతుందని భావిస్తున్నాను అన్నారు.. అవసరం అయితే EOIను వాయిదా వేయాలని డిమాండ్…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసులో తాజాగా, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా.. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.. అంతా అతని సైగల్లోనే, కనుసన్నల్లోనే జరిగాయంటూ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.. ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలో…
Fake Websites: కలియుగ ప్రత్యక్ష దైవం, కొలిచినవారి కొలువు బంగారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. ఇక, ఆన్లైన్ బుకింగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత.. టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు, శ్రీవారికి నిర్వహించే వివిధ సేవలు, ప్రత్యేక పూజలు, గదుల బుకింగ్ ఇలా అన్నీ ఆన్లైన్లోనే పెడుతున్నారు.. ఈ కోటాకు సంబంధించిన టికెట్లు ఆన్లైన్లో పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మొత్తం కోటా బుకింగ్ పూర్తి అవుతుంది.. అయితే, ఇదే సమయంలో…