అల్లూరి జిల్లా ఏజెన్సీలోని గిరుల్లో మే ప్లవర్స్ కనువిందు చేస్తున్నాయి. చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే అది కేవలం మే నెల రెండో వారంలోనే అతిథిలా కనిపించే పూలు ఈసారి ఒక వారం ముందే పూసాయి. గుబురుగా బంతి ఆకారంలో ఎర్రటి కలర్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బంతి, చామంతి, గులాబీ, కనకాంబరం, మల్లే, లిల్లి.. ఇలా ఎన్ని పూలు పెరట్లో పూచినా.. మే మాసంలో పూచే ఈ అరుదైన పుష్పాలపై మీరు ఓ లుక్కేయండి. కోవిడ్ తర్వాత ఈ పువ్వులు మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి.
Also Read : Chandrababu Naidu: రజనీకాంత్ కు వైసీపీ నేతలు సారీ చెప్పాలి
ఈ పూలను చూసిన పిల్లలు.. సరదాగా కరోనా వైరల్ పువ్వులని పిలుస్తున్నారు. ఈ పూల ఆకారం.. కరోనా వైరస్ ఆకారంలో సరిపోలి ఉండడంతో సరదాగా అలా పిలుస్తున్నారు. స్కాడొక్సస్ మల్టీ ఫ్లోరస్ జాతికి చెందిన ఈ మే పూలు ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఆంధ్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. బ్లడ్ లిల్లీ, బాల్ లిల్లీ, ఫైర్ బాల్ లిల్లీ అని అనే పేర్లతో కూడా ఈ పూలను పిలుస్తుంటారు. ఆంధ్రలో వాతావరణ పరిస్థితులను బట్టి కేవలం మే నెలలో మాత్రమే ఈ ప్లవర్స్ విరబూస్తాయి.
Also Read : Police: సారా కావాలన్న ఖైదీ.. సంస్కారంగా ఇప్పించిన పోలీస్
ఈ మే ప్లవర్స్ మొక్కలు అల్లూరి జిల్లాలో దాదాపు ప్రతీ ఇంట్లో కనిపిస్తుంటాయి. 15 నుంచి 20 సెంటిమీటర్ల పొడవు ఉండే కాండం గల ఈ మొక్కలు.. బంతి ఆకారంలో ఉండి 50 నుంచి 200 వరకు పూలు పూస్తాయని ఉద్వానశాఖ అధికారులు చెప్పారు. మే నెలలో పూసే ఈ పూలు దేవుళ్లను పూజించేందుకు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తుంటారని చెప్పున్నారు.