Kurnool Crime: ముద్దు పెట్టేందుకు భర్త యత్నం.. నాలుక కొరికేసిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Crime: పచ్చని సంసారాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి.. చిన్న చిన్న విషయాలకు ఆ కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి.. కొన్ని సార్లు ఆవేశం కట్టలు తెంచుకుని దాడికి పాల్పడుతున్నారు.. చివరకు హత్యలకు కూడా వెనుకాడడం లేదు.. తాజాగా, ఓ భార్య.. తనకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టాడని భర్త నాలుకను కొరికేసింది.. అంతకుముందు ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుండగా.. ఆ తర్వాత భార్యను మళ్లీ దగ్గరకు తీయాలని ప్రయత్నించాడట ఆ భర్త.. కూల్ చేయడానికి ముద్దు పెట్టేందుకు యత్నించాడట.. అప్పటికే కోపంతో ఉన్న భార్య ఒక్కసారిగా భర్త నాలుకను కొరికేసింది.
కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తారాచంద్ నాయక్ అనే వ్యక్తి పుష్పవతి అనే యువతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన తర్వాత కొన్ని ఏళ్లపాటు సంసారం బాగానే సాగింది.. అయితే, రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కూడా వారిద్దరూ గొడవపడ్డారట.. పరస్పరం దాడి కూడా చేసుకున్నట్టు చెబుతున్నారు.. ఇక, భార్యను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా తారాచంద్.. కొద్దిసేపటికి భార్యకు ముద్దుపెట్టే ప్రయత్నం చేశాడట.. అది కూడా లిప్‌కిస్ కోసం ట్రైచేశాడట.. అప్పటికే కోపంతో ఉన్న ఆమె.. వెంటనే భర్త నాలుకను కొరికేసింది.
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
అయితే, ఈ ఘటనపై ఒక్కొక్కరి వాదన ఒక్కలా ఉంది.. తనపై తారాచంద్ దాడి చేశాడని.. ఆపై తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడని అందుకే నాలుక కొరికానని పుష్పవతి.. జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మరోవైపు.. తన భార్యకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని.. ఎన్నిసార్లు చెప్పినా మనిషి మారడం లేదని.. అయినా కూడా తాను సర్దుకుపోతున్నానని తెలిపాడు.. అంతేకాదు.. తన భార్య నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని.. పిల్లలు, నేను ఎలా బతకాలో కూడా తెలియడం లేదంటూ వాపోయాడు తారాచంద్.. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా.. ఓ పచ్చని సంసారంలో చిన్న విషయాలు చిచ్చుపెట్టాయి.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!