B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
- కీర్తి(21) ఎంజీఐటీ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది
- డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- కీర్తి సోదరుడు నాగరాజు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ కలహాలు, ఆర్ధిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇలా రకరకాల కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో అడ్డంకులను ఎదుర్కొని ముందుకు సాగాల్సిందిపోయి సమస్యల వలయంలో చిక్కుకుని పరిష్కారం కోసం ప్రయత్నించకుండా తనువు చాలిస్తున్నారు. ఆత్మహత్య మహాపాపం అని తెలిసి కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ బీటెక్ విద్యార్థిని డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.
ఏం కష్టమొచ్చిందో ఏమో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో డీజిల్ పోసుకుని నిప్పింటించుకుని అగ్నికి ఆహుతైపోయింది. ఇన్‌స్పెక్టర్ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం బడంగ్‌పేట మారుతీనగర్‌లో నివాసం ఉంటోంది. కీర్తి(21) గండిపేట లోని ఎంజీఐటీ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు తల్లి, సోదరి, అన్న ఉన్నారు. శనివారం కళాశాలకు వెళ్లిన కీర్తి.. మధ్యాహ్నం ఇంటికి వచ్చింది.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
సాయంత్రం కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లగా.. కీర్తి డీజిల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంటలు వ్యాపించి కేకలు, పొగ రావడంతో ఇరుగు పొరుగు వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఇంటికి చేరుకునేసరికి కీర్తి మంటల్లో కాలిపోయి మృతిచెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మీర్పేట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కీర్తి సోదరుడు నాగరాజు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!