PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది ‘పెయిడ్ ప్రీమియర్స్’ ప్లానింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ క్రీడా నేపథ్య చిత్రం ‘పెద్ది‘ విడుదల విషయంలో మేకర్స్ మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రీమియర్ షోలను ప్లాన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ హీరోల సినిమాలకు తెలుగులో ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేయడం చూస్తుంటాం. కానీ ‘పెద్ది’ కోసం మేకర్స్ భారీ స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 4న సినిమా విడుదల కానుండగా అంతకంటే ఒక రోజు ముందే అంటే జూన్ 3న ఇండియా అంతటా ఈ ప్రీమియర్స్ వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా అవుట్‌పుట్ మీద ఉన్న నమ్మకంతోనే నిర్మాత వెంకట సతీష్ కిలారు డేరింగ్ డెషిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర హిందీ వెర్షన్ మరియు ఉత్తరాది పంపిణీ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దక్కించుకుంది. ఇటీవల బాలీవుడ్ ల వచ్చిన రణవీర్ సింగ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’ కోసం అనుసరించిన ప్రమోషన్ మరియు రిలీజ్ స్ట్రాటజీనే ‘పెద్ది’ కోసం కూడా అమలు చేయబోతున్నారు. బాలీవుడ్ మార్కెట్‌లో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసేందుకు జియో స్టూడియోస్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!