రేపటి (బుధవారం ) నుంచి లోక కళ్యాణార్ధం, భక్తజన శ్రేయస్సు కోసం విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సములు స్టార్ట్ కానున్నాయి. ఈ పవిత్రోత్సముల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆలయంలో జరిగే అన్ని ప్రత్యేక్ష పరోక్ష సేవలను ఆలయాధికారులు నిలిపేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగ ఓట్లను పుట్టించిందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఆయన ఆరోపించారు. ఆధార్ కార్డుతో లింక్ తర్వాత దొంగ ఓట్లు బయటికి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.. ఆపద ఉంది..! ఆదుకోండి అంటూ తన దగ్గరకు వచ్చిన ఓ నిరుపేద కుటుంబానికి బాసటగా నిలిచారు.. వారి ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న చిన్నారి ప్రాణాలను కాపాడేందేకు ఏకంగా రూ.41.50 లక్షలు మంజూరు చేయించారు.