AP Skill development case: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Skill development case: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, ఆయన విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియనుంది.. దీంతో.. మరోసారి ఆయన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు జైలు అధికారులు.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. మరోసారి విజయవాడకు తరలించకుండా.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే వీడియో కాలింగ్ ద్వారా వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు.. దీనికోసం రాజమండ్రి జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు..
Read Also: PM Modi: వచ్చే నెలలో మోడీ పెద్ద కానుక.. 30 వేల కుటుంబాలకు ఇళ్లు
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
మరోవైపు.. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఆయనపై అభియోగాలు మోపిన సీఐడీ.. ఈ కేసులో మరింత లోతైన విచారణ కోసం కస్టడీ కోసం ప్రయత్నాలు సాగిస్తోంది.. టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు ఏసీబీ కోర్టు మరోసారి వాయిదా వేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. గురువారం సాయంత్రమే దీనిపై తీర్పు వస్తుందని అంతా భావించారు. మొదట ఈ కేసు తీర్పును 10 నిమిషాలు వాయిదా వేసిన న్యాయమూర్తి.. ఆ తరువాత తీర్పు శుక్రవారం వెల్లడిస్తానని పేర్కొన్నారు. అయితే, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఈ నెల 9వ తేదీన అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఈ కేసులో ఇప్పటి వరకు జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే.. మరోసారి రిమాండ్ పొడిగింపునకు అవకాశం ఉందని.. చంద్రబాబుకు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం ఉందంటున్నారు న్యాయనిపుణులు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!