AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ తొలిరోజు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు.. చర్చకు పట్టుబట్టారు.. దీంతో.. గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో.. టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.. రెండో రోజూ కూడా అసెంబ్లీలో అదే రచ్చ సాగుతోంది.. అసెంబ్లీలో రెండో రోజు కూడా చంద్రబాబు అరెస్టు చుట్టూ రచ్చ జరిగింది.. స్కిల్ స్కాం అంశాన్ని అజెండాలో స్వల్ప కాలిక చర్చ లో పెట్టింది ప్రభుత్వం.. అయితే, కేసు ఎత్తేయకుండా చర్చ ఏంటి అని టీడీపీ ప్రశ్నిస్తోంది.. చంద్రబాబు అరెస్టు ఎత్తేయాలని వాయిదా తీర్మానంపై టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.. స్పీకర్ పోడియం ఎక్కి ప్లకార్డులు ప్రదర్శించారు. సైకో పాలన పోవాలి అంటూ నినాదాలు చేశారు.. ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. అయితే, టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో.. సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. దీంతో.. అసెంబ్లీని 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్.
Read Also: Shahrukh Khan: పఠాన్ ని బీట్ చేయలేకపోయిన జవాన్…