శ్రీవారికి గరుడ సేవ.. తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలుదీరిన తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకోగా.. ఈ రోజు ఉదయం 8 గంటలకు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. ఇక, రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇస్తారు.. అయితే, గరుడ సేవను చూసి తరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.. ఈ సాడి తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడికి గరుడ వాహన సేవ దర్శనం లభించేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. 2 లక్షల మంది భక్తులు మాడవీధులలోని గ్యాలరిల ద్వారా గరుడ సేవ విక్షించే అవకాశం కల్పించనున్నారు.. మాడవీధుల ఉరేగింపు సమయంలో ఐదు ప్రాంతాల వద్ద క్యూ లైన్‌ల ద్వారా భక్తులకు దర్శనం కలిగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. మొత్తంగా గరుడ సేవ సంధర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. గ్యాలరిలో వేచివున్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం కల్పించనున్నారు. అన్నప్రసాద సముదాయంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. 5 వేల మంది సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేసింది టీటీడీ.. 2700 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. భధ్రతా ఏర్పాట్లను ఇద్దరు డీఐజీలు, ఐదుగురు ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. రేపు ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరించారు.. నడకదారిలోనై ఆంక్షలు కొనసాగుతున్నాయి.. తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. తిరుమలకు విచ్చేసే మార్గాలలో వాహనాలకు టోకెన్లు అందిస్తామంటున్నారు పోలీసులు.. తిరుపతిలో మూడు ప్రాంతాలలో వాహనాల పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.. అలిపిరి వద్దే వాహనాల నియంత్రణ చేస్తున్నారు.
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్..
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, ఆయన విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియనుంది.. దీంతో.. మరోసారి ఆయన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు జైలు అధికారులు.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. మరోసారి విజయవాడకు తరలించకుండా.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే వీడియో కాలింగ్ ద్వారా వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు.. దీనికోసం రాజమండ్రి జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు..
నేడు శాసన సభ ముందుకు 3 కీలక బిల్లులు.. దానిపైనే టీడీపీ వాయిదా తీర్మానం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తొలిరోజు అసెంబ్లీ సమావేశాలను కుదిపివేసింది.. ఈ సందర్భంగా మీసాలు మిలేయడాలు, తొడగొట్టడాలు రచ్చరచ్చగా మారాయి.. ఇక, టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు స్పీకర్.. అయితే, రెండో రోజు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఈ రోజు ఉదయం 9 గంటలకే సమావేశం కానుంది అసెంబ్లీ.. ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ఆరభించనున్నారు.. మూలపేట ఓడ రేవు నిర్వాసితులకు సహాయ, పునరావాసం, బలవర్ధకమైన బియ్యం పంపిణీ, దిశా బిల్లు, దేవాలయ భూముల పరిరక్షణ, జల్ జీవన్ మిషన్, నవ రత్నాలు – పేదలందరికీ ఇళ్ళు, నూతన వైద్య కళాశాలల్లో ఫీజులు, మహిళా సాధికారత అంశాలపై ప్రశ్నలు వేయనున్నారు. అయితే, ఈ రోజు సభలో మూడు బిల్లులను ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం.. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ బిల్లు- 2023, ఏపీ వైద్య విధాన పరిషత్ రిపీల్ (రద్దు) బిల్లు -2023, ఏపీ ఆధార్ బిల్లు -2023 లాంటి కీలక బిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు.. ఇక, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం – తీసుకున్న చర్యలపై స్వల్ప కాలిక చర్చ సాగనుంది.. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా చంద్రబాబు అరెస్టు అక్రమం అనే అంశంపై చర్చకు పట్టుబట్టేందుకు సిద్ధం అవుతోంది టీడీపీ.. దీనిపైనే రెండో రోజు కూడా అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అధికారపక్షం ఎంత దుందుడుకుగా వ్యవహరించినా వెనక్కి తగ్గకూడదని టీడీపీ భావిస్తోంది.. శాసనమండలిలోనూ ఇలాగే వ్యవహరించాలని నిర్ణయం.
బస్సు ప్రయాణికులుక గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే 10 శాతం రాయితీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రజలకు మరింత సేవలందించేందుకు కొత్త కొత్త స్కీంలను ప్రవేశపెడుతోంది. ఇప్పటకే చాలా వినూత్న పథకాలకు టీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రజలకు మరో ఆఫర్‌ను ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా సొంతుళ్లకు వెళ్లే వారూ ముందుగా టీఎస్‌ఆర్టీసీలో బస్సు టికెట్లను బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 15 నుంచి 29లోపు ఒకే సమయంలో టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో 10 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేదీ వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో రాయితీ వర్తిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా చాలా మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 10 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఈ తగ్గింపు దసరా పండుగ సెలవుల్లో 15 రోజులు మాత్రమే వర్తిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ రాయితీ సౌకర్యాన్ని వినియోగించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. TSRTC బస్సులలో ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ని సంప్రదించాలని టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
తెలంగాణలో ప్రారంభమైన ఎన్నికల హడావుడి.. ఈసారి ఓట్ ఫ్రం హోం విధానం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడితో ఎన్నికల సందడి మొదలైందని తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాలు, బహిరంగ సభలతో ఇప్పటికే పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. అయితే.. మధ్యలో జమిలి ఎన్నికల మాట తెరపైకి రావడంతో.. కొంత అనిశ్చితి ఏర్పడి.. ఈసారి కుదరదని తేలిపోవడంతో.. మళ్లీ యథావిధిగా తమ పనిలో మునిగిపోయారు. కాగా, వచ్చే నెల మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కేంద్ర ఎన్నికల అధికారులు కూడా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. దీంతో… షెడ్యూల్ ప్రకారమే… డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఈసీ కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల్లో ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలిసారిగా.. ఈ ఓటు ఫ్రమ్ హోమ్ విధానాన్ని కర్ణాటక ఎన్నికల్లో అమలు చేశారు. అక్కడ సక్సెస్ కావడంతో తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఆప్షన్ 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పించనున్నారు. వీరితో పాటు వికలాంగులకు కూడా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించాలని ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో 80 ఏళ్లు దాటిన మొత్తం ఓటర్ల సంఖ్యపై సీఈసీ తాజా సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. ప్రస్తుతం తెలంగాణలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4,87,950 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా వారికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని సీఈసీ సూచించింది. అయితే, 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేయాలనుకుంటే ముందుగా తమ స్థానిక ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే అధికారులు పోస్టల్ బ్యాలెట్లను సిద్ధం చేస్తారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాల్లోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.
దేశంలో 25 ఏళ్లలోపు ఉన్నోళ్లకు ఉద్యోగాలొస్తలేవ్..
ప్రజల పొదుపు 50 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరుకుందని, ప్రజలపై అప్పుల భారం పెరుగుతోందని ఆర్‌బీఐ నివేదికలో పేర్కొంది. ఇప్పుడు దేశంలో నిరుద్యోగం గురించి ఆందోళన కలిగించే నివేదిక మరొకటి బయటకు వచ్చింది. దేశంలోని 25 ఏళ్లలోపు యువ గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దేశంలో నిరుద్యోగం రేటు 2019-20లో 8.8 శాతంగా ఉంది. ఇది 2020-21లో 7.5 శాతానికి, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతానికి తగ్గింది. కానీ చదువుకున్న యువతలో నిరుద్యోగిత రేటు పెరిగింది. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023ని ఉటంకిస్తూ ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. అత్యధిక నిరుద్యోగిత రేటు 22.8 శాతం 25 నుండి 29 సంవత్సరాల యువతలో ఉంది. ఉన్నత మాధ్యమిక స్థాయి విద్యను పొందిన 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతలో నిరుద్యోగం రేటు 21.4 శాతంగా ఉంది. 35 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగ రేటు ఐదు శాతం కంటే తక్కువగా ఉంది. 40 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్‌లలో నిరుద్యోగం రేటు 1.6 శాతం మాత్రమే.
నేడు ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే! ప్రపంచకప్ రేసులో ఉంటాడా?
స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత్ అసలైన సవాల్‌కు సిద్ధమైంది. నేటి నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భారత్, ఆసీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ప్రపంచకప్ ఆరంభానికి ముందు జట్టు బలాబలాలను పరీక్షించుకోవడానికి ఇదే మంచి అవకాశం. లోపాలను సరిదిద్దుకోవడానికి, కూర్పును సెట్ చేసుకోవడానికి, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకు రావడానికి దీనికంటే మంచి సమయం లేదు. మరి భారత్ ఈ వన్డే సిరీస్‌ను ఎలా సద్వినియోగం చేసుకుంటుందో? చూడాలి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లకు తొలి రెండు వన్డేల్లో బీసీసీఐ సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. రోహిత్ గైర్హాజరీలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. జోరుమీదున్న ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం టీమిండియాకు పెద్ద సవాలే. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఓడినప్పటికీ.. ఆసీస్ మంచి ఫామ్‌లో ఉంది. సీనియర్లు లేకపోవడంతో ఆసీస్ నుంచి రాహుల్ సేనకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి శ్రేయస్ అయ్యర్‌పైనే ఉంది. ఫిట్‌నెస్‌తో ఉన్నాడా?, ప్రపంచకప్‌లో ఆడతాడా? అన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో నేడు శ్రేయస్ బరిలోకి దిగుతాడో లేదో చూడాలి. వెన్ను గాయం కారణంగా ఆరు నెలల తర్వాత ఆసియా కప్‌లో పునరాగమనం చేసినా.. మళ్లీ వెన్ను సమస్యతో ఇబ్బందిపడ్డాడు. కేవలం రెండు మ్యాచ్‌లు ఆడడంతో శ్రేయస్ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. శ్రేయస్ ఇప్పుడు బాగానే ఉన్నాడని బీసీసీఐ చెపుతున్నా.. అతడు ఎంత ఫిట్‌గా ఉన్నాడన్నది ఈ సిరీస్‌తో తేలిపోనుంది.
బ్లూ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చిన బాలీవుడ్ బ్యూటీ..
ప్రస్తుతం బాలివుడ్ తో పాటు టాలివుడ్ లో కూడా బిజీ అవుతున్న బాలివుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటు సోషల్ మీడియాలో కూడా అదరిపోయే అప్ డేట్స్ తో హడావిడి చేస్తోంది.. తాజాగా పొట్టి స్కిన్ టైట్ డ్రెస్సులో రగులుతున్న సొగసులతో.. విరహపు మంటలు పుట్టిస్తోంది. కుర్రాళ్ళను గ్లామర్ తో నిలువునా కాల్చేస్తోంది జాన్వీ కపూర్. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ.. హడలెత్తిస్తోంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బ్లూడ్రెస్లో జాన్వీ కపూర్.. ఎద అందాలు ఆరబోస్తూ.. థండర్ థైస్ ను కనిపించీ కనిపించకుండా కవర్ చేస్తూ.. కుర్రాళ్ల హృదయాలలో కాకపుట్టిస్తోంది.. ఒక్కమాటలో చెప్పాలంటే కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. బాలివుడ్ లో వరుస సినిమాలతో పాటు, టాలివుడ్ లో కూడా బిజీ అవుతుంది..యంగ్ టైగర్ ఎన్టీఆర్ జతగా దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమా షూటింగ్ శరవేగంగాజరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ చేపలు ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ అందరిని ఆకట్టుకుంటుంది..
ఈ క్లాసిక్ కి యూత్ ఫిదా… థియేటర్స్ లో రచ్చ చేస్తున్నారు
టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీస్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా #7G బృందావన్ కాలనీ. ఒక అడల్ట్ సినిమాగా, హీరోయిన్ బాడీ ఆబ్జక్టిఫయ్యింగ్ తో స్టార్ట్ అయ్యే ఈ సినిమా సడన్ గా ఎమోషనల్ రైడ్ గా మారి ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చోని చూసే సినిమాగా మారిపోతుంది. ఆ గ్రాఫ్ ని, సినిమా ఛేంజ్ అయిన విధానానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తెలియకుండానే ఫ్యామిలీ డ్రామా లోకి వెళ్లిపోయిన #7G బృందావన్ కాలనీ సినిమా క్లయిమాక్స్ కి వచ్చే సరికి కంటతడి పెట్టించేస్తది. హిలేరియస్ కామెడీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో-హీరోయిన్ సూపర్బ్ లవ్ ట్రాక్, ఇప్పటికీ వినాలనిపించే సాంగ్స్… #7G బృందావన్ కాలనీ సినిమాని ఒక కల్ట్ క్లాసిక్ స్టేటస్ గా నిలబెట్టాయి. సెల్వరాఘవన్ సినిమాటిక్ బ్రిలియన్స్ #7G బృందావన్ కాలనీ సినిమాలో కనిపిస్తుంది. 2004లో రిలీజ్ అయిన ఈ మూవీని రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ గా రీరిలీజ్ చేసారు. ఈరోజు థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీని మళ్లీ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయడానికి యూత్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోవడంతో అన్ని థియేటర్స్ కంప్లీట్ గా ప్యాక్ అయిపోయాయి. డైలాగ్స్ ని, సాంగ్స్ ని థియేటర్స్ లో కూర్చున్న వాళ్లు ఎంజాయ్ చేస్తూ… రిపీట్ చేస్తున్నారు. క్లైమాక్స్ కి ప్రతి ఒక్కరూ 19 ఏళ్ల క్రితం ఎంతగా ఎమోషనల్ అయ్యారో ఇప్పుడు కూడా అంతే ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ #7G బృందావన్ కాలనీకి సీక్వెల్ వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసారు, ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఈ మాస్ కాంబినేషన్ ప్రాజెక్ట్ అఫీషియల్ గా చెప్పారు కానీ అడ్రెస్ లేదు
సౌత్ సెన్సేషన్ అట్లీ బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేసి సాలిడ్ హిట్ కొట్టాడు. వెయ్యి కోట్ల సినిమా చేసిన అట్లీకి ఇప్పటివరకూ ఫ్లాప్ అనేదే లేదు. దళపతి విజయ్ తో మూడు సినిమాలు చేసి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అట్లీ, తన నెక్స్ట్ సినిమాని సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, అజిత్ లాంటి స్టార్ హీరోలతో చేస్తాడు అనే మాట వినిపిస్తోంది. వీరిలో అల్లు అర్జున్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది కానీ ప్రస్తుతం బన్నీకి ఉన్న లైనప్ ప్రకారం చూస్తే అట్లీతో ప్రాజెక్ట్ చేయడం ఇప్పట్లో అయ్యేలా కనిపించట్లేదు. పుష్ప 2 అయిపోగానే బన్నీ, త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ సినిమా కూడా ఉంది. సో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అయ్యే ఛాన్స్ లేదు. అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా రోజులుగా వినిపిస్తున్న పేరు ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’. వైజయంతి క్రియేషన్స్ బ్యానర్ పై అశ్వినీ దత్, ఎన్టీఆర్-అట్లీ కాంబినేషన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కాదు చాలా ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది. అట్లీ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా చేయాలి, చర్చలు జరుగుతున్నాయి అని స్వయంగా అశ్వినీ దత్ ఒక ఫిల్మ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పటినుంచి ఇప్పటివరకూ అట్లీ-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఏం అయ్యిందో ఎంత వరకు వచ్చిందో తెలియదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బిజీ అయిపోయాడు. దేవర, NTR 31, వార్ 2 సినిమాలతో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యేసరికి 2024 ఎండ్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏమైనా అట్లీ-ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తారేమో చూడాలి. ఇప్పుడు అట్లీకి కూడా పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి ఒక పక్కా కమర్షియల్ మాస్ సినిమా విత్ అట్లీ స్టైల్ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవ్వడం గ్యారెంటీ.