Dhadi Shetty Raja: ఏపీలో కూటమి ప్రభుత్వంపై కాకినాడ వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన నడుస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడే వారిని సీఎం చంద్రబాబు దుర్భాషలాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక, వికలాంగులను దొంగలతో పోల్చడం, యూరియా కోసం మాట్లాడే రైతులను మా పార్టీవాళ్లుగా ముద్ర వేయడం అత్యంత దుర్మార్గం అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది.. రైతులు ఆందోళన చెందుతున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు.
Read Also: Bigg Boss Telugu 9: మరికాసేపట్లో బిగ్ బాస్.. లోపలికి వెళ్లిన వారెవరంటే?
అయితే, సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న రెడ్ బుక్ పాలనకు, కేసులకు ప్రతిపక్షాలు ఎప్పటికీ భయపడవని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. ఆధార్ కార్డుల ఆధారంగా ఫేక్ రైతులు యూరియా బస్తాలను సేకరించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. అలాగే, పేదలకు వైద్యం పేరుతో సీఎం కోట్ల రూపాయల స్కామ్ చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా, వారిని అవమానించేలా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని దాడిశెట్టి రాజా మండిపడ్డారు.