విజయదశమి పండుగ సమయంలో టీడీపీ నిరసనలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసుల అలర్ట్ అయ్యారు. జగనాసుర దహనం పేరిట నిరసనలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నిరసనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు లేఖకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ లేఖ రాశారు. 45 రోజుల జైలు జీవితం తర్వాత కూడా.. నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మారుస్తూ మీరు ఉత్తరం రాశారు అంటూ సెటైర్ వేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కా్మ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే, చంద్రబాబు నాయుడు జైలు నుంచి నా ప్రియాతి ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ లేఖ విడుదల చేశారు.
మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడిపారు. పొదిలి మండలంలోని పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి ఆయన శ్రీకారం చుట్టారు.
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని కడమల కాల్వలో పెను విషాదం చోటు చేసుకుంది. భార్య కీర్తికి శ్రీమంతం చేసుకునే ఇంటికి వచ్చే సరికి భార్త ఏసురాజు మృత్యు ఒడిలోకి జారుకున్నాడు.
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలి.. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదు..
టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. వాళ్ళ భవిష్యత్తుకే గ్యారెంటీ లేని వాళ్ళు ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు.. దీని కోసం విస్తృత స్థాయి సమావేశం అట.. 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు లాంటి నాయకుడు ఉండడు.. నోట్లో వేలు పెడితే కొరకలేడట అని ఆయన మండిపడ్డారు.
సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడే పోరాట యోధుడే పోలీస్ అని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. అధునాతన వ్యవస్థలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్న వారిని ఎదుర్కోవలసిన బాధ్యత నేటి పోలీసులపై ఉంది అని ఆయన తెలిపారు.