రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు. అయితే, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం చేపడతారు. ఉదయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకోనున్నారు.
ఏపీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. దసరా కానుకగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ పోవాలి.. జనసేన-టీడీపీ రావాలి ఇదే రకంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి.. సీఎం పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమనేది నా భావన.. సీఎం పదవి వస్తే స్వీకరిద్దాం.. కానీ, దాని కంటే ముందు రాష్ట్రం ముఖ్యం: పవన్ కళ్యాణ్
మూలా నక్షత్రం కానున్న నేపథ్యంలో కనక దుర్గ అమ్మవారిని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం పర్యటన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం వుళేబీడు గ్రామ సమీపంలో వేరు శనగ పంట పొలాలలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. ఆలూరులో మంత్రి జయరాం ఉండి కూడా పంట పొలాలను పరిశీలించకపోవడం చాలా బాధాకరం అని ఆయన వ్యాఖ్యనించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు.. దానిని తిప్పికొట్టాల్సిన భాద్యత మీ అందరిపైనా ఉందంటూ పిలుపునిచ్చారు వైవీ సుబ్బారెడ్డి.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో సంక్షేమ, అభివృద్ధి పధకాలకు వివరించనున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.
Andhra Pradesh, Minister Botsa Satyanarayana, AP Government and International Baccalaureate MoU, AP Government, International Baccalaureate, YSRCP, Janasena Party