టీడీపీ, జనసేన మీటింగ్లో ఏదైనా విషయం ఉందా..? బలహీన పడ్డ టీడీపీని బలోపేతం చేయడం కోసం కలిశానని పవన్ కళ్యాణ్ చెప్ప్తున్నారు.. కానీ ప్రజలు ఈ కలయికని పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. అయితే, మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ( ఎక్స్ ) సొంత కుమారుడు.. అద్దె కుమారుడు.. ఇద్దరూ ఉత్తర కుమారులే !.. సూటుకేసు తీసుకో..లోకేషుతో కలిసిపో!.. అనే పోస్ట్ ను పెట్టారు.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. జనవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు సులువుగా దర్శించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ప్రతి నెల టీటీడీ రిలీజ్ చేస్తుంది.
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లోని కొండపై కొలవైన ఉన్న శ్రీ మాల మల్లేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. దసరా తరువాత స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా ఉరేగింపు ఘట్టంలో కర్రల సమరం ఆనవాయితీగా వస్తుంది. గత కొన్ని ఏళ్లుగా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి గొడవల వల్ల కర్రల సమరంగా ఆ పేరు వచ్చింది.
నేడు మేడిగడ్డకు కేంద్ర జలసంఘం సభ్యులు.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల బృందంతో కుంగిన బ్యారేజ్ పరిశీలన..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయన కుమారుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి ములాకాత్ అయ్యారు.
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాకాత్ ముగిసింది అని మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు అందర్నీ ధైర్యంగా ఉండమన్నారు.. ప్రజలంతా ఆయన ఎప్పుడూ బయటికి వస్తారా అని ఎదురుచూస్తున్నారు.
తెలుగు ప్రజలకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ మా అందరికి బాధాకరమైన విషయం.. తితిలీ తుఫాన్ సమయంలో మా జిల్లా ప్రజలతో కలిసి బాబు దసరా జరుపుకున్నారు.. ప్రజా నాయకుని అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని ఆయన ఆరోపించారు.
డీఎస్పీ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఏపీ డీజీపీ కేవీ రాజేంద్ర నాథ్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులను జాగ్రత్తగా ఎదుర్కోవాలి.. పోలీసులు ప్రజలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. భక్తులు శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,187 మంది భక్తులు దర్శించుకున్నారు. 29, 209 మంది తలనీలాలు సమర్పించారు.