MLC Pothula Sunitha: సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఫైర్ అయ్యారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత.. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. బాలకృష్ణకు సినిమాల్లో , రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానించారు.. కూతురు వయస్సువున్న హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.. బాలకృష్ణ సినిమాల్లో ఒక రకంగా , నిజ జీవతంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
Read Also: Black Friday: ఈరోజు బ్లాక్ ఫ్రైడే! అంటే ఏంటి.. ప్రజలు ఏం చేస్తారంటే ?
కాగా, గతంలోనూ బాలయ్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పోతుల సునీత.. అసెంబ్లీలో బాలకృష్ణ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో బాలకృష్ణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్న ఆమె.. ఎమ్మెల్యేగా ఏనాడైనా బాలకృష్ణ ప్రజల సమస్యల పై చర్చించాడా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు పౌరుషం ఏమైంది..? మీ నాన్న పై చెప్పులు వేయించినపుడు ఎక్కడికి పోయింది పౌరుషం అంటూ గతంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం విదితమే.