వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ వినియోగం పై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయాలని.. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండాలని.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లేనిపోని ఆరోపణలు చేస్తే లోకేష్ నాలుక కట్ చేస్తాను అంటూ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి... మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా తీరం వెంబడి అధికారులు తగిన చర్యలు చేపట్టారు .. తుఫాను తీవ్రతరం అవుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. ఏపీ వైపు మిచౌంగ్ తుఫాన్ దూసుకువస్తున్నందున్న భారీ రైళ్లరు రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటన ఇచ్చింది మొత్తం 144 రైళ్లను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. డిసెంబర్ 2 నుంచి 6 వరకు ఏపీ మీదులగా వెళ్లే 144 రైళ్లను రద్దు చేసింది. అందులో సికింద్రాబాద్, విజయవాడ , విశాఖపట్నం, తిరుపతి నుంచి వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి. కావునా ప్రయాణికులు తమ సహకరించాలని, ఇప్పటికే ఈ…
సనాతన భావజాలం, లెఫ్ట్ భావజాలం అంటే ఇష్టం నాకు.. రెండూ ఒక తాటిపైకి తేవాలన్నది నా ఉద్దేశం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పార్టీ కండువా కప్పి వారిని జనసేనలోకి ఆహ్వానించిన ఆయన మాట్లాడుతూ.. దాశరధి రంగాచార్య, కృష్ణమాచార్య కూడా సనాతన విధానాలు పాటించినా.. వామపక్ష విధానాలతో ఉద్యమించారని గుర్తుచేశారు.
ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు నాలుగు జిల్లాలకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు.. పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్.