ఆడుదాం ఆంధ్ర వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటి అంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు. జగన్ దోచుకోవడానికి ఇదొక కొత్త డ్రామా.. స్టేడియాల అభివృద్ధి లేదు.. క్రీడాకారులు ప్రోత్సాహం లేదు.. మంత్రి సీదిరి అప్పల రాజు నోరు అదుపులో పెట్టుకో.. చర్చకు రాకుండా పారిపోయిన నువ్వు.. ఇంకో సారి వాగితే రోడ్ల మీద తిరగనివ్వం అంటూ కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వంశీతో నాకు 2009 నుంచే పరిచయం ఉంది.. ప్రజా రాజ్యం యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి వంశీతో నాకు పరిచయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీ జనసేనలోకి వచ్చిన ఆయనని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.. వంశీ తన సొంతింటికి వచ్చారు.
పల్నాడు జిల్లా నరసారావు పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గపోరు తాడేపల్లికి చేరింది.. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు స్థానిక నేతలు.. ఈ సారి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం ఆందోళన నిర్వహించింది..
విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ పార్టీ మారుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.. దానికి మరింత బలాన్ని చేకూరుస్తూ.. ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం కాబోతున్నారు ఎమ్మెల్సీ వంశీ.. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలో చేరబోతున్నారంటూ ఓ వైపు ప్రచారం సాగుతుండగా.. ఇదే సమయంలో ఆయన పవన్‌తో భేటీకానుండడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
వచ్చే ఎన్నికల్లో మా వ్యూహం మాకు ఉంటుంది.. కేంద్ర అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేస్తానని ప్రకటించారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల్లోను టెన్షన్మొదలైంది.. దానికి ప్రధాన కారణం.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్థాలచలనం కలగడమే.. మరికొందరికి అయితే, సీటు కూడా కష్టమని అధిష్టానం నుంచి క్లారిటీగా సందేశాలు వెళ్లాయి.