PVP Satirical Comments on Kesineni: కేశినేని నానిపై పీవీపీ సెటైర్లు.. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PVP Satirical Comments on Kesineni: విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే మిగిలింది.. ఇప్పటికే తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఆ రాజీనామాకు ఆమోదం లభించగానే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.. ఇక, బుధవారం రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసిన విషయం విదితమే.. అయితే, ఆది నుంచి కేశినేని నాని అంటే విరుచుకుపడే ప్రముఖ నిర్మాత, గత ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానంలో వైసీపీ తరఫున పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ).. తాజా పరిణామాలపై సెటైర్లు వేశారు. కేశినేని నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.. ”బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వీడి బుద్ది గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్” అంటూ X లో ట్వీట్ చేశారు పీవీపీ..
Read Also: Cyber Fraud: ప్రజాపాలన దరఖాస్తులో సైబర్ కేటుగాళ్లు.. కాల్ చేసి 10 వేలు కొట్టేశారు..
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
ఇక, ”చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన.. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను.” అంటూ ఈ నెల 6వ తేదీన ఓ ట్వీట్ చేశారు కేశినేని నాని.. దీనిపై స్పందించిన పీవీపీ.. తన ట్వీట్‌ను కేశినేని నానికి ట్యాగ్ చేస్తూ.. ‘కేశినేని నాని పీపాల బస్తా, బెజవాడకే గుదిబండలా తయారయ్యావ్ నువ్వు.. ఏదో మచ్చ ఏసుకుని పుట్టావు, పార్టీ పుణ్యమా అని పదేళ్లు బండి కొనసాగించావు, బ్యాంకులను బాదావు, జనాలని, ఉద్యోగులని పీల్చి పిప్పి చేసావు.. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి, అన్ని మూసుకుని మూలపడుండు పుండాకొర్!!” అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇప్పుడు కేశినేని నాని వైసీపీలో చేరడం ఖాయమైన తర్వాత.. ”బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వీడి బుద్ది గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్” అంటూ కామెంట్ పెట్టారు పీవీపీ. అయితే, గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అయిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)పై విజయం సాధించిన విషయం విదితమే. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తూ వచ్చింది.. కొంత కాలం తర్వాత ఇద్దరూ సైలెంట్ అయినా.. తాజా పరిణామాలు మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లకు దారి తీసింది.
పీవీపీ తాజా ట్వీట్:
బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే..వీడి గుడిసేటి బుద్ధి గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్!!
— PVP (@PrasadVPotluri) January 11, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!