నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు అంబటి రాయుడు.. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా.. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను.. ధన్యవాదాలు అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు అంబటి రాయుడు
ఈ సారి కందుకూరు అసెంబ్లీ సీటు నాకు లేదని.. రాదని కొంత మంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. నా సీటు ఎక్కడికీ పోలేదు.. నా సీటులో టవలేసి మరీ ఇక్కడే ఉంది అంటూ చమత్కరించారు.. నేను సీట్ల కోసం, పదవులకోసం వెంపర్లాడే వాడిని కాదని స్పష్టం చేశారు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. త్వరలోనే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు.. తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. త్వరలో లోక్ సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని కేశినేని ట్వీట్ చేశారు.. నా అవసరం లేదని చంద్రబాబు భావించారు. ఇంకా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని తన ట్వీట్లో రాసుకొచ్చారు.