తాము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదని అన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీ అయినా.. మున్సిపల్ కార్మికుడు అయినా ఉపాధ్యాయుడు అయినా అందరూ ఒక్కటేనని తెలిపారు. ఐదో తేదీ నుండి గర్భిణీలకు, బాలింతలకు వైయస్సార్ కిట్లును ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. అంగన్వాడీలు 11 సమస్యలు తమ ముందు ఉంచారని.. అందులో 10 సమస్యలకు ఒప్పుకున్నామని తెలిపారు. మిగతా ఒకటి జీతాన్ని పెంపుదల చేయాలని అన్నారు. ఎన్నికల ముందు పెంపుదల చేయడం భావ్యం…
సచివాలయంలో మున్సిపల్ కార్మికులతో జీవోఎం చర్చలు ముగిసాయి. కార్మిక సంఘాల డిమాండ్ల పై మంత్రి బొత్స, సజ్జల, అధికారులు విడిగా చర్చించారు. కనీస వేతనం 21 వేల కంటే అదనంగా మరో మూడు వేలు అయినా పెంచాలని మున్సిపల్ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. అంతేకాకుండా.. గ్రాట్యుటీ ఇవ్వాల్సిందేనని మున్సిపల్ కార్మిక సంఘాలు కోరారు. అయితే.. జీతాలు 24 వేలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో మరోసారి చర్చలు విఫలమయ్యాయి. కాగా.. సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు…
ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. తమను అదిరించి, బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. తమకు కనీస వేతనం 26,000 ఇచ్చి తీరాలని లేదంటే అప్పటివరకు సమ్మె చేసి తీరతాం అంటున్నారు.
ఈసారి నరసరావుపేట నుండి కాదు గుంటూరు నుంచి పోటీ చేయమని అధిష్టానం చెప్పిందన్నారు. కానీ, తనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని ఎంపీ స్పష్టం చేశారు.. పల్నాడులో చాలా పనులు సగం సగం మిగిలిపోయాయని.. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉందని అంటున్నారు ఎంపీ..
అంగన్వాడీలపై సీరియస్ యాక్షన్‌కు దిగింది ఏపీ ప్రభుత్వం.. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
లోక సభ స్పీకర్ అనుమతి కోరాను.. స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని వెల్లించారు. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు కేశినేని నాని.
వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే.. అదికూడా ఒంగోలు నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు బాలినేని.. విలువతోనే రాజకీయాలు చేస్తున్నా.. విలువల కోసమే మంత్రి పదవిని వదులకుని.. సీఎం వైఎస్ జగన్ వెంట నడిచానని తెలిపారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్ధానాల మార్పు జరుగుతోందన్నారు.