స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వ ఆదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనక మేడల రవీంద్ర కుమార్ నాకు ఒక సవాల్ విసిరారు.. దాన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పారు.. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ ప్రతినిధిగా నేను మాట్లాడాను అని ఆయన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రముఖ రాజకీయ నాయకుడు నిందితుడిగా ఉన్నారు.. ఈ స్కామ్ లో 371 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ధనం దుర్వినియోగమైంది అని ఆరోపించారు. రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును నిందితుడిగా చేర్చారు.. ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి వారి దగ్గర ఉన్న సాక్షాలను పరిశీలించి రిమాండ్ కు ఇచ్చారు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Ayodhya: అయోధ్యకు స్పెషల్ ట్రైన్లు.. భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్..
చంద్రబాబు ఇతర నిందితులతో కలిసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అని ప్రభుత్వ ఆదనపు జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. రిమాండ్ రిపోర్టులో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు.. తీర్పుపై చర్చకు సిద్ధమా అని టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ కు ఆయన సవాల్ విసిరారు.. నేను ఎక్కడైన చర్చకు సిద్ధంగానే ఉన్నాను.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కనకమేడల అంటున్నారు.. ఆయన రాజ్యసభ సభ్యత్వం కొన్ని రోజులు మాత్రమే ఉంది.. రిమాండ్ రిపోర్టు లేకపోతే తెప్పించుకొని చదవాలి.. అప్పుడు అన్ని విషయాలు అర్థమవుతాయని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.