ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను అని స్పష్టం చేశారు ఎంఎస్ బాబు.. ఇంట్లో తండ్రిని కొడుకు ఏ విధంగా అడుగుతాడో అదే హక్కుతో నేను మాట్లాడాను.. వాటిని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు.
ఫేస్ బుక్ పోస్ట్ లో అన్ని వివరాలు సవివరంగా పెట్టా.. అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదన్న ఎంపీ కేశినేనా నాని.. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసా వహిస్తా అని స్పష్టంగా ఫేస్ బుక్ లో పెట్టా.. కానీ, మీడియాకు కావాల్సింది మసాలెనేగా.. తినబోతూ రుచులెందుకు..? అన్ని విషయాలు ఒకే రోజెందుకు? అని ప్రశ్నించారు.
ఉమ్మడి మ్యానిఫెస్టోలో పలు అంశాలు పరిశీలించాలంటూ పవన్ కల్యాణ్కు సూచించారు హరిరామ జోగయ్య.. సీఎం వైఎస్ జగన్ను ఓడించాలంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే మెరుగైన పథకాలు అమలు చేయాలన్నారు.
మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు కాపు నేతలు, వ్యాపార ప్రముఖులతో రహస్యంగా సమావేశం అయ్యారట.. విశాఖలోని బీచ్ రోడ్డులో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ రహస్య సమావేశంలో కీలక అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. ఈ సమావేశంలో పాల్గొన్నవారికి సెల్ ఫోన్లకు కూడా అనుమతి ఇవ్వకుండా జాగ్రత్త వహించారట నిర్వాహకులు.. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ గెలుపే ప్రధానంగా పనిచేయాలని నిర్ణయించారట..
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నెల్లూరు జిల్లా కోడలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో.. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రగాయాలపాలయ్యారు.. అయితే, ఈ ప్రమాదంలో.. అక్కడిక్కడే ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి పీఏ వెంకటేశ్వరరావు మృతిచెందారు.
ఇవాళ్టి నుంచి రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న ఈ తెలుగు మహాసభలు నేటి నుంచి ఆదివారం వరకు స్థానిక గైట్ కళాశాల ప్రాంగణం ఆతిథ్యమిస్తోంది.