తిరువూరులో ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ రచ్చగా మారింది.. దీంతో, చర్యలకు పూనుకుంది టీడీపీ.. ఎంపీ కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసింది.. బెజవాడ ఎంపీ టిక్కెట్టను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని. మొత్తంగా తిరువూరు ఘటన తర్వాత క్లారిటీ ఇచ్చేసింది టీడీపీ అధిష్టానం.
ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఏపీలో బీజేపీ నేడు కీలక సమావేశం నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల యోజన భైఠక్ పేరుతో జరిగిన కీలక భేటీలో.. ఎన్నికల్లో పొత్తులు, ఎన్నికల వ్యూహంపై చర్చించారు.
మరోసారి పవన్ కల్యాణ్‌కు సవాల్ చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాకినాడ నుంచి నాపై పోటీ చేయమని గతంలోనే పవన్ కి సవాలు చేశాను.. కనీసం గ్లాస్ గుర్తు అయినా నా మీద పోటీ పెట్టమని కోరుతున్నాను అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ ఎన్ని రివ్యూలు చేసుకున్న ఓడిస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుంది.. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీన నిర్ణయం తీసుకుందన్నారు. షర్మిల తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ, ఎలాంటి సంబంధం లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి
కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇలా ఎన్ని పార్టీలు వచ్చినా మేం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అన్నారు.
మా నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లోనే నా ప్రయణం.. ఆయన అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నాను అన్నారు వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ)ని విలీనం చేశాం అన్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. వైఎస్సార్ జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు.. నేను మా నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్నాను అన్నారు.