* నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం.. ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ సర్కార్..
* నేడు మరోసారి స్పీకర్ ను కలవనున్న బీఆర్ఎస్ నేతలు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరనున్న బీఆర్ఎస్ నేతలు..
* నేడు నల్గొండ జిల్లాలో తెలంగాణ గవర్నర్ పర్యటన.. మహాత్మగాంధీ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవానికి హాజరుకాననున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..
* నేడు హెచ్ఎండీఏ కార్యాలయానికి ఆర్ఆర్ఆర్ రైతులు.. ట్రిపుల్ ఆర్ నోటిఫికేషన్ పై అభ్యంతరాలకు ముగియనున్న గడువు..
* నేడు తెలంగాణలో కాలేజీలను తెరవొద్దని యాజమాన్యాల నిర్ణయం.. ప్రభుత్వంతో చర్చల ఫలితాల తర్వాతే బంద్ పై నిర్ణయం తీసుకోనున్న ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు..
* తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ పేట, సిద్ధిపేట జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం..
* నేడు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఏపీ సచివాలయంలో జరిగే సదస్సులో పాల్గొననున్న సీఎం.. సదస్సులో అంశాలపై మంత్రులు, కార్యదర్శులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
* నేడు ఉదయం 9.30 గంటలకు 2025 మెగా డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల.. 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి.. ఫైనల్ సెలక్షనర్ లిస్ట్ విడుదల చేయనున్న విద్యాశాఖ అధికారులు..
* నేడు తిరుపతిలో రెండో రోజు కొనసాగుతున్న జాతీయ మహిళ సాధికారిత సదస్సు.. ప్రముఖుల ప్రసంగాలు, విద్యా, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య భద్రత, తల్లి ఆరోగ్యంపై చర్చ.. సదస్సు ముగింపుకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం..
* నేడు బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దర్యాప్తు.. విచారణకు హాజరుకానున్న మాజీ ఎంపీ మిమి చక్రవర్తి..
* నేడు బీహార్ లో ప్రధాని మోడీ పర్యటన.. రూ. 45 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్ణియా ఎయిర్ పోర్టును ప్రారంభించనున్న మోడీ.. నాలుగు కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
* నేడు వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు.. మూడు కీలక అంశాలపై ఉత్తర్వులు ఇవ్వనున్న సుప్రీం.. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం.. మే 22న తీర్పును రిజర్వు చేసిన సుప్రీంకోర్టు..