Seediri Appalaraju: సిద్ధం అయ్యాం.. సైన్యమై.. సమరానికి ముందుకు కదులుదాం అని పిలుపునిచ్చారు మంత్రి సీదిరి అప్పలరాజు.. విశాఖపట్నంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఉత్తరాంధ్ర చరిత్రలోనే సిద్ధం సభ ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. కోట్లాది మంది పేదల కోసం వైసీపీ కార్యకర్తలు సిద్దం కావాలి. ప్రజలు జన్మభూమి కమిటీల నుంచి బయట పడాలంటే మేం సిద్దం కావాలి.. సిద్ధం అయ్యాం.. సైన్యమై, సమరమై ముందుకు కదులుతాం అని పేర్కొన్నారు. భయపడేవాడు తొడు కావాలి, సహాయం కావాలి అని ఎదురు చుస్తున్నారు. పొత్తుల కోసం వెంపర్లాడి వేచి చూస్తున్నవారు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కానీ, వైసీపీలో భయానికి తావులేదు.. సింగిల్ గా వెళ్లి అత్యధిక స్థానాలు గెలుచుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: KTR: ఆటో ఎక్కిన కేటీఆర్.. ఎందుకో తెలుసా..?
వైఎస్ షర్మిల కామెంట్లపై, ఆమె తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి అప్పలరాఉ.. సమాధానం చెప్పడం చాలా తేలిక.. వైఎస్ కటుంబాన్ని కాంగ్రెస్ ఏవిధంగా టీడీపీతో కలసి ఇబ్బంది పెట్టిందో తెలుసు. అన్ని మర్చిపోయి అలా కాంగ్రెస్ పార్టీతో వెళ్లడం ఏ లబ్ధికోసమో మాకు తెలియదన్నారు. తెంగాణలో పార్టీ పెట్టినప్పుడు నాకు జగనన్నతో ఎలాంటి విభేదాలు లేవని వైఎస్ షర్మిల చెప్పారని గుర్తుచేశారు. ఇక, పలాసలో బస్సు ఒక్కేముందు ఒక్క పదినిమిషాలు మాకు అవకాశం ఇస్తే చేసిన అభివృద్ధి చూపించేవాళ్లమని సవాల్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.