మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ పాలన ముగుస్తుందని జోస్యం చెప్పారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీతి, నిజాయితీతో పుట్టిన టీడీపీకి నేనొక పిల్లర్ లాంటి వాడిని.. అలాంటి నేను పార్టీ మారతాను అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాల్గో లిస్ట్‌పై కసరత్తుకు మూడు రోజులు బ్రేక్ ఇచ్చింది. ఇక, ఇవాళ వైసీపీ నాల్గవ జాబితాపై కసరత్తు కొనసాగనుంది.. ఇప్పటికే 59 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన వైసీపీ అధిష్టానం.. మరో ఐదారు నియోజకవర్గాల్లో మార్పులపై స్పష్టతకు వచ్చింది..
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా తనను విశ్వసించినందుకు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కె.సి.వేణుగోపాల్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు వైఎస్ షర్మిల ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం అందించేలా.. పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో నమ్మకంగా పని చేస్తానని హామీ ఇస్తున్నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాణిక్కం ఠాకూర్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని అన్నారు.
వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. ఇదే సమయంలో.. సోమవారం రోజు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టు పేర్కొన్నారు.