ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధం అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అది కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారట.. ఈ నెల 25వ తేదీన భీమిలిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు వైసీపీ రెడీ అవుతోంది.
వెయ్యి మంది బాలయ్యలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని..
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట రోజు ఆంధ్రప్రదేశ్‌లో సెలవుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.. సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దీంతో.. రాష్ట్రంలో ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.. అయితే, ఏపీలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారు.. 22వ తేదీన దేశం మొత్తం చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు సెలవు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా…
Andhra woman Arrest: డబ్బులు చెల్లించకుండా 15 రోజులగా ఢిల్లీలోని ఓ హోటల్లో బస చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మహిళను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఏరో సిటీలోని ఓ విలాసవంతమైన హోటల్లో గత 15 రోజులుగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా 37 ఏళ్ల మహిళ ఉంటోందని, ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.