Speaker Tammineni Sitaram: చంద్రబాబు ఎందుకు గాబరా పడుతున్నారు.. ప్రజలు ఓట్లు వేస్తారు.. ప్రజలు ఎవరి పక్షమో త్వరలో తెలుస్తోందన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఎన్ని చెబుతాడో.. అన్ని చెప్పమనండి.. చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఏకమై చేస్తామంటే కుదిరే పని కాదు.. ఓటర్ ఒక్కడే.. ఓటరే తలరాత మారుస్తాడని హెచ్చరించాడు. ఇక, అనర్హత వేటు విషయంలో స్పీకర్ పై సీఎం జగన్ వత్తిడి తెస్తున్నారని చెప్పడం సరికాదని హితవుపలికారు.. బయటకిపోయినవారు అలానే మాట్లాడుతారు.. వాళ్ల దగ్గర నుండి ఎక్కువ ఎక్స్ పర్ట్ చేయలేమని దుయ్యబట్టారు.. అనర్హత విషయంలో నిర్ణయంపై గాబరా పడొద్దు.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారణకి పిలిచాం.. వాళ్లు చెప్పాల్సింది చెప్పారు.. మీడియా ముందు మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముద్దాయిగా వచ్చి కుర్చోన్నారు.. చెప్పాల్సింది చెప్ప మన్నా , మేటర్ ఈజ్ ఓవర్ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఎలా ప్రవర్తించారో అందరూ చూశారు.. అసెంబ్లీ అజెండా చింపి విసిరారు.. ఓ పార్టీలో పుట్టి.. ఇంకో పార్టీలోకి వెళ్లడం కరెక్ట్ కాదు అనేది వారు డిసైడ్ చేసుకోవాలన్నారు. ఏ పార్టీలో గెలిచామో ఆ పార్టీలో ఉండాలని ఎమ్మేల్యేలు ఆలోచించు కోవాలని హితవుపలికారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.
Read Also: Delhi Fog: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 50కి పైగా విమానాలకు అంతరాయం!
కాగా, వైసీపీ-టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం మరో ఛాన్స్ ఇచ్చారు. అనర్హత పిటిషన్ల పై మరోసారి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8న స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొ్న్నారు. ఫిబ్రవరి 5లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలి అని నోటీసులో స్పష్టం చేశారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, పిటిషనర్ ప్రసాద్ రాజులకు నోటీసులు అందించారు. ఈ క్రమంలో ఒకేసారి ఐదుగురుని విచారణ చేయనున్నారు స్పీకర్. కాగా.. మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకోనున్నారు. ఆ తరవాత ఎమ్మెల్యేల అనర్హత పై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు స్పీకర్ తమినేని.