ఎన్టీవీతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జగన్ వైఎస్ ఫోటోను ఎలా వాడుకున్నారు.. ఇపుడు ఆ ఫోటో ఎక్కడ ఉందో ప్రజలకు తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ హయాంలో పాలన ఇప్పటి పాలనను ప్రజలు బేరీజు వేస్తున్నారు.
పెత్తందార్లు అంటూ ఎమ్మెల్యే ఎలిజా చేసిన వ్యాఖ్యలపై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ స్పందించారు. మంత్రిగా పని చేసిన కోటగిరి విద్యాధర రావు పెత్తందారీ అయితే ఆయన్ని ఐదుసార్లు ప్రజలు గెలిపించేవాళ్ళు కాదు అని ఆయన వ్యాఖ్యనించారు. నేను పెత్తందారి అయితే లక్షన్నర మెజారిటీతో ఎంపీగా గెలిచేవాడిని కాదు.. తెలంగాణ ఎన్నికల తర్వత సీఎం వైఎస్ జగన్ పార్టీలో కొన్ని మార్పులు చేపట్టారు అని ఎంపీ పేర్కొన్నారు.
నేడు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిటీలతో పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచార విధివిధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
తిరుమలలో రద్దీ భారీగా తగ్గింది. ఇవాళ ఆదివారం అయినా రద్దీ పెద్దగా కనిపించడం లేదు.. అయితే, సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో పాటు పరీక్షలు కూడా దగ్గరపడుతుండటంతో భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు పేర్కొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంట ప్రాణం తీసుకుంది. నదిలో పడి ఒకరు, రైలు కింద పడి మరొకరు మృతి చెందారు. అయితే, కొమరాడ మండల కేంద్రానికి చెందిన పద్మజ తోటపల్లి బ్యారేజిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. పార్వతీపురం మండలం చినమరికి గ్రామానికి చెందిన వానపల్లి శ్రావణ్ కుమార్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Rashmika Mandanna deepfake: నటి రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో గతేడాది సంచలనంగా మారింది. బ్రిటిష్ ఇన్ఫ్లూయెన్సర్ జరా పటేల్ వీడియోకి రష్మికా ముఖాన్ని మార్ఫింగ్ చేసి రూపొందించిన ఈ వీడియోపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ దుర్వినియోగంపై కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ వీడియో మార్ఫింగ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.