AP Legislative Council: న్యాయవాదుల సంక్షేమ నిధి సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ శాసన మండలి.. న్యాయవాదుల గుమస్తాల సంక్షేమ నిధి చట్టం సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది.. ఇక, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఇచ్చిన మేనిఫెస్టోని 99 శాతం అమలు చేసిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు.. గవర్నర్ ప్రసంగం అక్షరసత్యం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు.. విద్య తోనే పేదరికం నిర్మూలన జరుగుతుంది.. వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికి ఆదర్శం.. సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనే అన్నారు. తెలుగుదేశం సభ్యులకు అభివృద్ధి ఎక్కడుందో కుప్పం వస్తే చూపిస్తాం.. అని సవాల్ చేశారు. ఇక, సీఎం వైఎస్ జగన్ త్వరలోనే వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు అని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.
మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాలను, బలహీన వర్గాలను పాలనలో భాగస్వామ్యం చేశారని పేర్కొన్నారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.. 30 లక్షల మందికి పైగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఇల్లు ఉంటేనే ఆత్మస్థైర్యం కలుగుతుంది.. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటిపైన తెలుగుదేశం జెండా.. ఒంటి పైన పసుపు చొక్కా ఉంటేనే పెన్షన్ ఇచ్చే వాళ్లని.. కానీ, మా ప్రభుత్వంలో అన్ని పార్టీ కార్యకర్తలకు అర్హులైన వారందరికీ పింఛన్ ఇస్తున్నాం అని స్పష్టం చేశారు మర్రి రాజశేఖర్.
మా ప్రభుత్వం డిబిటి నాన్ డిబిటీ ద్వారా 4 లక్షల 20 కోట్లకు పైగా సంక్షేమాన్ని ప్రజలకు అందించాం అని తెలిపారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.. ఉద్దానంలో 85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేశాం.. వందల కోట్లు పెట్టి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి అందిస్తున్నాం.. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్య రంగాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి..