CM YS Jagan: చంద్రబాబు ఏనాడూ మంచి చేసింది లేదు.. కానీ, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి లాగి వెళ్లారని విమర్శించారు సీఎం వైఎస్ జగన్.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకాలు, ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించారు.. ఇదే సమయంలో.. కేంద్రం కంటే రెట్టింపు స్థాయిలో చంద్రబాబు అప్పులు తెచ్చాడు అని ఫైర్ అయ్యారు. కానీ, ఎక్కువ అప్పులు చేశామని మన మీద అబద్ధాల ప్రచారం చేస్తున్నారని.. మన హయాంలో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం అప్పులు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 5.2 శాతం మాత్రమే చేసింది.. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వానికి, మనకూ ఎంత వ్యత్యాసముందో చెప్పేందుకు ఈ సమాచారం సరిపోతుందన్నారు.
Read Also: Top Headlines @ 5 PM : టాప్ న్యూస్
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటికి రూ.లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే.. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరిందన్నారు సీఎం వైఎస్ జగన్.. 2019 మే నెల నాటికి 4,12,288 కోట్ల రూపాయల అప్పులు ఏపీకి ఉన్నాయన్న ఆయన.. రూ.4.12 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడది ఏడు లక్షల కోట్ల పై చిలుకుగా ఉందన్నారు.. మన హయాంలో ఆర్థిక సంఘం సిఫారసుల కంటే రూ. 366 కోట్లు తక్కువగా అప్పులు తీసుకున్నామని గుర్తుచేశారు.. గ్యారెంటీలతో కలిపి వివిధ సంస్థలు చేసిన అప్పులు.. గ్యారెంటీల్లేని అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే
విభజన నాటికి.. రాష్ట్ర ప్రభుత్వం అప్పు 132000 కోట్లుగా ఉందన్నారు. గ్యారెంటీల్లేని ప్రభుత్వ అప్పులు కూడా కలుపుకుంటే మొత్తం అప్పు రూ. 1,53,000 కోట్లు అన్నారు.. మొత్తంగా చంద్రబాబు హయాంలో అప్పులు పెరగింది 21.87 ఏడాదికైతే… మన హయాంలో ఇది కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ.. ఖర్చులు పెరిగినప్పటికీ.. బటన్‌లు నొక్కినప్పటికీ కూడా.. చంద్రబాబు హయాయంలో ఉన్న 21. 87 శాతం అప్పుల పెరుగుదల రేటు ఉంటే మన హయాంలో మాత్రం అది 12.13 శాతం మాత్రమే ఉందన్నారు సీఎం వైఎస్ జగన్.. అంటే.. అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశామని వెల్లడించారు.. కానీ, మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అసెంబ్లీ వేదికగా విపక్షాలపై విరుచుకుపడ్డారు.. సీఎం జగన్ అసెంబ్లీలో ఏం మాట్లాడారో కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..