అంగన్వాడీల ఆందోళనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పటికే ఆ ఆదేశాలు అమలు చేసే దిశగా అడుగులేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. దీనిపై బీజేపీ అధిష్టానందే తుది నిర్ణయం అని ఆమె చెప్పుకొచ్చారు. రేపు అయోధ్యలో శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించక పోవడం శోచనీయం అని అన్నారు
పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కామెంట్స్ పై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. తడిచిన ధాన్యం ఎక్కడ ఉందో చెబితే కొంటామని అన్నారు. వెంటనే ఆర్డీవోను పిలిచి కొనుగోలు చేయిస్తాను.. సారథి నిన్నటి వరకు మాతోనే ఉన్నాడు.. ఇప్పటికి ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు.. ఇంకా టీడీపీ కండువా కప్పుకోలేదు.