గ్రూప్-1 కు ప్రిపేరై సమయంలోపు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోయినవారికి ఏపీపీఎస్సీ ఊరట కలిగించే న్యూస్ చెప్పింది.. గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంచింది.. ఈ నెల 21వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసిపోగా.. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు.. వరుసగా సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తూ వస్తున్న ఆయన.. రేపు ఉరవకొండ వేదికగా.. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.