జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకం అని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనాపై రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు ఏర్పాటు చేశారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి కృషంరాజు ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ లీలా గ్రాండ్ హోటల్ లో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతితో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ మరో కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. వైసీపీ- టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారం నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు పార్టీల రెబల్ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను విచారణకు రావాల్సిందిగా ఇవాళ అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు నోటీసులు ఇచ్చారు.