జగన్ సీఎం కాకపోతే జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి..!
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే జరిగిన నష్టాన్ని.. మళ్లీ జరగబోయే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ మిథున్‌రెడ్డి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా మిథున్ రెడ్డి హాజరుకాగా.. మంత్రి విశ్వరూప్, ఎంపీ చింతా అనూరాధ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే పొన్నాడా సతీష్, జిల్లా వైసీపీ నాయకులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే జరిగిన నష్టాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఐదు సంవత్సరాల కాలంలో జగన్ ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా నిర్వర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. సచివాలయాన్ని జన్మభూమి కార్యాలయంగా మార్చేస్తారని విమర్శించారు. ఇక, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కచ్చితంగా పార్టీలు గుర్తింపు ఉంటుందని తెలిపారు మిథున్‌రెడ్డి.. పి గన్నవరం ఇంచార్జ్ విప్పర్తి వేణుగోపాల్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి పిలుపునిచ్చారు.
భారత్‌లోనే విశాఖ అన్ని ప్రాధాన్యతలు వున్న నగరం..
భారత్ లోనే విశాఖపట్నంకు అన్ని ప్రాధాన్యతలు వున్న నగరంగా గుర్తింపు ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. రానున్న కాలంలో విశాఖ పరిపాలన కేంద్రంగా మారనుందని తెలిపారు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ అభివృద్ధి ప్రణాళిక ప్రకటించారని గుర్తుచేశారు.. గడిచిన రెండేళ్లలో విశాఖలో అనేక రకాల మౌలిక సదుపాయాలు సీఎం కల్పించారని తెలిపారు. విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనను ప్రజలందరూ ఆమోదిస్తున్నారని తెలిపారు. ఇక, భవిత ద్వారా యువతలో నైపుణ్యత పెరుగుతుందని వెల్లడించారు. పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యత శిక్షణ ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన మేలు జరగనుందన్నారు. ఏ ప్రభుత్వం ఆలోచించని రీతిన సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అనుకూల పాలన అందిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
టీడీపీలో చేరిన మంత్రి జయరాం.. తొలి స్పందన ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి పదవితో పాటు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరైన జయహో బీసీ సభకు హాజరైన ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు.. ఇక, టీడీపీలో చేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు జయరాం.. గతంలో టీడీపీలో పని చేశాను.. మళ్లీ టీడీపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు.. బడుగులకు స్వతంత్రం రావాలి.. టిక్కెట్లు బడుగులకిచ్చి.. అగ్ర కులాలకు ఇంఛార్జీలను ఇస్తే స్వతంత్రం ఉంటుందా..? అని టీడీపీ చేరిన తర్వాత వ్యాఖ్యానించారు మంత్రి గుమ్మనూరు జయరాం.
దేశ సంస్కృతిని కాపాడేది బీసీలే.. వారిపై దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డు వేస్తాం
బీసీలపై దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డు వేస్తాం అని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మంగళగిరిలో టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించిన జయహో బీసీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అక్రమాలపై వైసీపీలోని బీసీ నేతలు ఆలోచించాలని సూచించారు.. బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించకుంటే బీసీ కులాలకు అన్యాయం చేసినట్టేనని వైసీపీ బీసీ నేతలు ఆలోచించాలని హితవుపలికారు.. బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని ఆకాక్షించారు.. బీసీల కోసం ఏడాదికి రూ. 75 వేల కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ, అది సున్నా.. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు హామీని గాలికి వదిలేశారని మండిపడ్డారు. అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడిని పెట్రోల్ పోసి చంపేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు పవన్.. భారత దేశ సంస్కృతిని కాపాడేది బీసీలే అన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో వడ్డెర్లకు ఆర్థికంగా బలం చేకూరేలా చేస్తాం.. పల్లెకార్ల కులాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. గంగవరం పోర్టు నిర్వాసితులు సహా అందరికీ న్యాయం చేస్తాం. తీర ప్రాంతంలో ప్రతి 30 కిలో మీటర్లకు ఓ జెట్టి ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బీసీల దగ్గర డబ్బు ఉండకూడదని జగన్ జీవోలు తెచ్చారని విమర్శించారు. 153 బీసీ కులాలకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించిన ఆయన.. బీసీలు ఐక్యంగా ఉంటే.. ఎవ్వరూ ఏం చేయలేరన్నారు. బీసీలకు ఎన్టీఆర్ అధికారం కల్పిస్తే.. జగన్ వచ్చీ రాగానే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లల్లో 10 శాతం కోత విధించారని దుయ్యబట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
బీసీలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్.. రూ.4 వేలకు పెంపు
బీసీ కులాలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్ అమలు చేస్తాం.. పెన్షన్ రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచుతాం అంటూ ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మంగళగిరి వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించిన జయహో బీసీ బహిరంగ సభలో.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత సభలో మాట్లాడుతూ.. బీసీ కులాలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు.. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో బీసీలకు ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్ల మేర కేటాయింపులు చేస్తాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోత వేసిన రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను రద్దు చేస్తాం.. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకోస్తాం.. ఎస్సీ, ఎస్టీ తరహాలో బీసీలకు ప్రత్యేక చట్టం. బీసీ పారిశ్రామిక వేత్తల ప్రొత్సహానికి రూ. 10 వేల కోట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. షరతుల్లేకుండా బీసీలకు విదేశీ విద్యను అమలు చేస్తాం అన్నారు చంద్రబాబు.. పీజీ విద్యార్థులకు ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ పునరుద్దరిస్తామన్న ఆయన.. బీసీల కోసం రూ. 10 లక్షలతో చంద్రన్న కానుక తీసుకొస్తాం అన్నారు. పెళ్లి కానుక తిరిగి ప్రవేశపెడతాం. ప్రతి ఏడాది కుల ధృవీకరణ తీసుకునే వ్యవస్థలను రద్దు చేస్తాం.. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తాం అన్నారు. బీసీ నాయకత్వంపై వైసీపీ గొడ్డలి వేటు వేసిందని విమర్శించారు చంద్రబాబు.. మంత్రిగా ఉండి.. ఎంపీ టిక్కెట్ వద్దని వైసీపీని వీడి మంత్రి గుమ్మనూరు వచ్చేశారు. గుమ్మనూరు ఏ తప్పు లేకుండానే సీటు మార్చారు.. తప్పు చేసిన వాళ్లని మార్చే దమ్ము ఉందా..? అని సవాల్ చేశారు. వైఎస్ జగన్‌కు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసెస్ గా అభివర్ణించారు చంద్రబాబు..
కేబినెట్ నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్
జయహో బీసీ సభ వేదికగా తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంపై వేటు వేసింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేబినెట్ నుంచి జయరాంను బర్తరఫ్ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసిన జయరాం.. ఆ వెంటనే సాయంత్రం టీడీపీలో చేరారు. ఇక, ఆలస్యం చేయకుండా వెంటనే ఆయనపై చర్చలకు దిగారు సీఎం జగన్.. గుమ్మనూరు జయరాంను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సిఫార్సు చేశారు సీఎం జగన్.. ఇక, సీఎం నిర్ణయానికి ఆమోదించిన గవర్నర్.. ఈ మేరకు గెజిట్ విడుదల చేశారు.. దీంతో.. గుమ్మనూరు జయరాం కేబినెట్ నుంచి బర్తరఫ్ అయినట్టు అయ్యింది.
ప్రధాన మంత్రిని పెద్దన్న అంటే తప్పేముంది
తెలంగాణలో ప్రతిపక్ష నేతనే లేడు ఉంటే అసెంబ్లీకి వచ్చే వారు కదా అని సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో తెలిపారు. కేసీఆర్ లాగా మేము మోడీకి చెవిలో ఏమీ చెప్పలేదు అన్నారు. పదేళ్లలో కేసీఆర్ వందేళ్ల విధ్వంసం చేశారు.. కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని వంద రోజుల్లో సరిదిద్దీ పనిలో ఉన్నాం.. వంద రోజుల మా పనితనంపై వచ్చే ఎన్నికల్లో తీర్పునివ్వండి అని ఆయన చెప్పుకొచ్చారు. మా పాలన మీద మాకు విశ్వాసం ఉంది.. పారదర్శక పాలన అందిస్తున్నాం అని తెలిపారు. నాలుగు నెలల గడువు అవసరమా అని ప్రశ్నించారు. కేసీఆర్ కి పొలిటికల్ పనిష్మెంట్ ప్రజలు ఇచ్చారు.. లీగల్ గా చర్యల కోసం ప్రాసెస్ ఉంటుందన్నారు. అయితే, విచారణ లేకుండా ఎవరికి ఉరిశిక్ష వేయలేం కదా.. మేడిగడ్డ రిపేర్ లపై కేసీఆర్ హరీష్ రావుల వాదనకు కంటెంట్ లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తాము చేసిన దొంగతనం కప్పిపుచ్చుకునేందుకే రిపేర్లు చేయాలని తమ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. దొంగతనం చేసిన వాళ్ళే సపరేట్ గా మేడిగడ్డకు వెళ్లారు.. మాతో కలిసి మేడిగడ్డకు ఎందుకు రాలే అని ప్రశ్నించారు. మేడిగడ్డకు రిపేర్ చేయాలని నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే రిపేర్లు చేస్తాం.. కేసీఆర్ చదివింది కేవలం బీఏనే.. పార్లమెంట్ ఎన్నికల్లో పీజీ చేసినట్టు సమాచారం ఇచ్చాడు.. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులే మేడిగడ్డలో దొంగలు.. ఈ దొంగల సలహాలు తీసుకొని రిపేర్లు చేయమంటారా అంటూ సీఎం అడిగారు. నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ నివేదికకు నాలుగు నెలల గడువు అవసరమా.. బీజేపీ- బీఆర్ఎస్ సర్దుబాటు చేసుకోవడానికి నాలుగు నెలలు గడివిచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు.
అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు
సివిల్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE) 2024 పరీక్షకు దరఖాస్తుల గడువును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) పొడిగించింది. నేటి (మంగళవారం)తో ముగుస్తున్న ఆ గడువును బుధవారం వరకు పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 14న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దరఖాస్తుల గడువు మార్చి 5(మంగళవారం)తో ముగియడంతో ఆ గడువును ఒక్కరోజు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 150 ఖాళీల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తుల గడువును సైతం పొడిగించింది. ఈ రెండు పరీక్షలకు ఇంకా దరఖాస్తు చేసుకోనివారు మార్చి 6న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకొనే వెలుసుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పరీక్షలు దరఖాస్తులు చేసుకోవచ్చు.
“పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదని”.. నిద్రిస్తున్న భర్తను పొడిచిన భార్య..
బెంగళూర్‌లో దారుణం జరిగింది. పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదనే కోపంతో ఓ మహిళ నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచింది. ఈ సంఘటన ఫిబ్రవరి 27 తెల్లవారుజామున జరిగింది. 35 ఏళ్ల మహిళ, 37 ఏళ్ల తన భర్తపై దాడి చేసింది. వెంటనే తేరుకున్న అతను భార్యను పక్కకు నెట్టేయడంతో బతికిపోయాడు. గాయాలతో ఉన్న అతను ఆస్పత్రికి వెళ్లేందుకు పొరుగువారి సాయం తీసుకున్నాడు. మెడికో లీగల్ కేసు కావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. మార్చి 1న సదరు మహిళపై కేసు నమోదు చేయబడింది. ఇది కుటుంబ సమస్య కావడంతో వారిద్దరు చర్చించుకుని, సమస్యను పరిష్కరించుకోవడానికి దంపతులకు సమయం ఇచ్చామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. తన తాత మరణించడంతో వివాహ వార్షికోత్సవానికి భార్య కోసం గిఫ్ట్ కొనుగోలు చేయలేదని ప్రాథమిక విచారణలో తేలింది. అతను తన భార్యకు బహుమతి ఇవ్వకపోవడం ఇదే తొలిసారి కావడంతో ఆమె కలత చెందిందని అధికారులు చెప్పారు. తన భార్య కొన్ని వ్యక్తిగత సమస్యలతో బాధపడుతోందని, ఆమెకు కౌన్సిలింగ్ చేయమని చెప్పాడని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
రాహుల్ గాంధీ ప్రేమ నాకొద్దు.. లాలూ హిందూ నిర్వచనాన్ని మరిచిపోయాడు..
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ.. అతను హిందువు కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాలూ తీరును ఎండగట్టారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనకు తెలిసిన హిందూ సంస్కృతిని మరిచిపోయాడని ఎద్దేవా చేశారు. ఇంతకాలం హిందూ వ్యతిరేకిగా ఉండటమే అందుకు కారణం కావచ్చని అన్నారు. అస్సాంలోని బొంగైగావ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ అస్సాం ప్రజలకు తాను ప్రేమను అందించాననే వ్యాఖ్యలపై హిమంత స్పందిస్తూ.. ‘‘నాకు అతని ప్రేమ వద్దు, అస్సాంలో చాలా మంది తల్లులు, కుమార్తెలు ఉన్నారు, వారి ప్రేమ నాకు సరిపోతుంది’’ అని అన్నారు.
గాల్లో రెండు విమానాలు ఢీ.. ఇద్దరు మృతి
నైరోబీ నేషనల్ పార్క్ పైన రెండు విమానాలు (Plane Collision) ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని కెన్యా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ శిక్షణ విమానం నేల కూలి ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. సఫారీలింక్ ఏవియేషన్ (Safarilink Aviation)కు చెందిన ఫ్లైట్ ఐదుగురు సిబ్బంది సహా 44 మందితో మంగళవారం ఉదయం నైరోబీలోని విల్సన్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంది. అప్పటికే అక్కడినుంచి బయల్దేరిన ఓ చిన్నపాటి శిక్షణ విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో నైరోబీ జాతీయ పార్కు గగనతలంలో ఉన్న శిక్షణ విమానాన్ని మరొకటి వచ్చి ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో చిన్న విమానం నేలకూలగా.. అందులోని ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు చెప్పారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే భారీ శబ్దం వినిపించింది. దీంతో సిబ్బంది వెంటనే ఫ్లైట్‌ను వెనక్కి మళ్లించి, సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సఫారీలింక్ ఏవియేషన్ తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
గల్లీలో పిల్లలతో కలిసి గోళీలు ఆడుతున్న స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్
భారత కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అభిమానులకు ఇదొక శుభవార్త. డిసెంబర్ 2022లో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్.. తొందరగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో పంత్ కోలుకుంటున్నాడు. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అయితే.. తను ఇటీవల వీధిలో పిల్లలతో కలిసి గోళీలు ఆడుతూ కనిపించాడు. పిల్లలతో కలిసి కింద కూర్చుంటూ గోళీలాట ఆడాడు. వారిలో కలిసి పోయి సీరియస్‍గా గోళీలకు గురి పెడుతూ ఆట కొనసాగించాడు. పిల్లలతో పోటీ పడుతూ ఆటలో లెక్కలు కూడా కట్టాడు రిషబ్ పంత్. తన స్కోరు ఎంత అని పిల్లలను అతడు అడగడం కూడా వీడియోలో ఉంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో.. ఈసారి ఐపీఎల్ లో ఆడనున్నట్లు అభిమానులు అనుకుంటున్నారు. రిషబ్ పంత్.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పిల్లలతో తన వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో.. అతను తన ముఖాన్ని కర్చీఫ్ కట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా.. తలపై టోపీ పెట్టుకున్నాడు. ఈ వీడియోను క్రికెట్ హ్యాండిల్ ‘@CricCrazyJohns’తో ‘X’లో కూడా పోస్ట్ చేశారు. దీనిని ఒక మిలియన్ కంటే ఎక్కువ సార్లు చూశారు. ఈ పోస్ట్‌పై యూజర్ల నుంచి అనేక స్పందనలు వస్తున్నాయి. స్టార్ అయ్యి ఇంత డౌన్ టు ఎర్త్ గా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో పంత్ తను చిన్నానాటి రోజులను గుర్తుచేసుకున్నాడేమో అంటూ సరదాగా అంటున్నారు. తనని చూసి వారికి కూడా పాత రోజులు గుర్తొచ్చాయంటూ అభిప్రాయపడుతున్నారు.
దేవర అవ్వలేదు.. వార్ మొదలెట్టలేదు.. అప్పుడే ఇంకొకటా.. ?
ఆర్ఆర్ఆర్ వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ కానీ, చరణ్ కానీ మరో సినిమాతో వెండితెరపై కనిపించింది లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ ఏడాది ఏప్రిల్ లో దేవర సినిమాతో వస్తాడు అనుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ సైతం దేవర సినిమాను.. కొరటాల శివతో కలిసి శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నారు. ఒక్క సీన్ అవుట్ ఫుట్ మంచిగా రాకపోయినా మళ్లీ రీ షెడ్యూల్ చేస్తూ.. ఎంతో జాగ్రత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్.. బాలీవుడ్ ఎంట్రీ ఎదురుచూస్తూ ఉంది. YRF స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ కూడా భాగం కానున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా వార్ 2 రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2 సినిమాని హోల్డ్ చేసి మరీ వార్ 2 సినిమా చేస్తున్నాడు అంటే ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవలే స్పైయిన్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన వార్ 2 సినిమా సెట్స్ లో ఎన్టీఆర్ ఇంకా జాయిన్ అవ్వలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే ఎన్టీఆర్ డూప్ తో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఫినిష్ చేశారని టాక్. ఇందులో ఎంత నిజముందో తెలియదు. ఇక దేవర షూట్ ను ఫినిష్ చేసి.. తారక్, వార్ 2 సెట్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
గుండెల్ని పిండే ఉదయ్ కిరణ్ “నువ్వు నేను” రీ రిలీజ్.. గెట్ రెడీ
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ కొంత కాలం క్రితం అనూహ్యంగా అందరికీ దూరం అయ్యారు. ఇక ఆయన ఎన్నో సినిమాలతో ప్రేక్షకులలో మరచిపోలేని ముద్ర వేసుకున్నాడు. ఇక రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఆయన నటించిన నువ్వు నేను అనే సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ లో అనిత హీరోయిన్ గా నటించగా … టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి తేజ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సునీల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించారు. పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా 2001 వ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల అయి మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా జోరుగా పెరిగాయి, ఇక అలా చివరగా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ఆ సమయంలో ఒక స్లైడ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు రీ రిలీజ్ పనులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీని ఈ సంవత్సరం మార్చి 21న థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈమేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.