ఏపీలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గతేడాది డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారాన్ని వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలింగ్ బూతులపై ప్రధాన ఎన్నికల అధికారికి రెండు లేఖలు రాశారు. పోలింగ్ బూతుల్లో తీసుకోవాల్సిన చర్యలు.. ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామి రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కుందురు నాగార్జున రెడ్డిని అత్యధిక మెజారిటితో గెలిపించాలి అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు.
గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను జగన్ అమలు చేశారు అని నెల్లూరు లోక్ సభ వైసీపీ సమన్వయకర్త విజయ సాయి రెడ్ది తెలిపారు. ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసు..
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడన్న ఆయన.. దానికి నిదర్శనం గుడివాడ సీటే అని వ్యాఖ్యానించారు.
దశాబ్దాల కలలు కన్న వెలిగొండ ప్రాజెక్టు సాకారం చేసుకున్నాం.. ప్రాజెక్టు ప్రారంభించే అవకాశాన్ని దేవుడు నాకివ్వటం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు సీఎం వైఎస్ జగన్. వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు వైఎస్సార్ శంఖుస్థాపన చేసి పనులు మొదలు పెడితే.. ఇవాళ ఆయన కొడుకుగా రెండు టన్నెల్స్ ను ప్రారంభించటం దేవుడి రాసిన స్క్రిప్ట్ అని భావిస్తున్నాను అన్నారు..
దశాబ్దాల కల నెరవేరుస్తూ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన.. ట్విన్ కెనాల్స్ ప్రారంభోత్సవ పైలాన్ ను ఆవిష్కరించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫోటో గ్యాలరీని సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించి.. జరగాల్సిన పనులపై ఆరా తీశారు సీఎం వైఎస్ జగన్.