జయహో బీసీ సభ వేదికగా తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంపై వేటు వేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేబినెట్ నుంచి జయరాంను బర్తరఫ్ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి..
బీసీలపై దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డు వేస్తాం అని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం జగన్ చేస్తున్న అక్రమాలపై వైసీపీలోని బీసీ నేతలు ఆలోచించాలని సూచించారు.. బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించకుంటే బీసీ కులాలకు అన్యాయం చేసినట్టేనని వైసీపీ బీసీ నేతలు ఆలోచించాలని హితవుపలికారు.. బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని ఆకాక్షించారు.. బీసీల కోసం ఏడాదికి రూ. 75 వేల కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ, అది సున్నా..…
మంత్రి పదవితో పాటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరైన జయహో బీసీ సభకు హాజరైన ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు.. ఇక, టీడీపీలో చేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు జయరాం.. గతంలో టీడీపీలో పని చేశాను.. మళ్లీ టీడీపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు..
Vande Bharat Trains: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చని సెమీ హైస్పీడ్ రైల్ ‘‘వందేభారత్ ఎక్స్ప్రెస్’’ తరుచుగా దాడులకు గురవుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు రైలు ప్రయాణిస్తున్న సమయంలో రాళ్లతో దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. తాజాగా నైరుతి రైల్వే(ఎస్డబ్ల్యూఆర్) జోన్ గుండా వెళ్తున్న 4 వందేభారత్ ట్రైన్లపై ఆదివారం రాళ్ల దాడి జరిగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారని అధికారులు మంగళవారం…