ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. అనకాపల్లి సభలో బటన్ నొక్కి మహిళల ఖాతాలో 18 వేల 750 చొప్పున జమ చేస్తారు. వైఎస్సార్ చేయూత కింద అర్హులైన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18 వేల 750 చొప్పున.. వారి ఖాతాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న విషయం విదితమే..
నెల్లూరు ప్రభుత్వ కళాశాల స్నాతకోత్సవంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యశాల..మెడికల్ కాలేజీగా అభివృద్ధి చెందటం సంతోషం కలిగిస్తోంది అని పేర్కొన్నారు.
కొందరు నన్ను నెల్లూరు నుంచి పంపించేశారు అని అంటున్నారు అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుమతి తీసుకుని మళ్ళీ నెల్లూరుకు వస్తా..
దక్షిణ కాశీగా పేర్గాంచిన రాజమండ్రి పవిత్ర గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి అయోధ్య బాల రాముని దర్శనానికి బైక్స్ పై బయల్దేరుతున్న యువకులిద్దర్నీ ఎంపీ మార్గాని భరత్ అభినందించారు. వారి ప్రయాణం దిగ్విజయంగా కొనసాగాలని కోరారు..
25శాతం ఉన్న కాపు కులస్తులకు కూడా టీడీపీ- జనసేన కూటమి వారి ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలతో సమానంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ కాపు డిక్లరేషన్ని కూడా ప్రకటించాలని హరిరామయ్య జోగయ్య డిమాండ్ చేశారు.
రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోబోతున్నాను తెలిపారు. బలిజలంటే జగన్ కు ద్వేషం.. నాకు గతంలో అండదండగా ఉన్న పెద్దిరెడ్డి నాపై చేసిన విమర్శలను పట్టించుకోను.. ఆయనను విమర్శించే స్దాయి నాకు లేదు.. కానీ, నాపై విమర్శలు చేస్తున్న ప్రస్తుత వైసిపీ అభ్యర్ధికి భవిష్యత్తులో సమాదానం చెబుతాను అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు.