తిరుమల నడకమార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు..
తిరుమల నడక మార్గంలో గత ఏడాది ఆగస్టులో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేయడం కలకలం రేగింది.. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే కాగా.. టీటీడీ చరిత్రలోనే ఇది తొలి ఘటనగా నిలిచిపోయింది.. అయితే, ఆ లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించారు అటవీశాఖ అధికారులు.. ఇప్పటికే బంధించిన నాల్గో చిరుతే.. చిన్నారి లక్షిత పై దాడి చేసినట్లు గుర్తించారు.. ఇక, ఈ ఘటన తర్వాత మొత్తం ఆరు చిరుతలను టీటీడీ – ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో బంధించిన విషయం విదితమే.. మరోవైపు.. లక్షితపై దాడి చేసిన చిరుతను జూపార్కులోనే సంరక్షించాలని నిర్ణయించింది టీటీడీ.. కాగా, గత ఏడాది ఆగస్టు 11వ తేదీన చిన్నారి లక్షిత(6)పై చిరుత దాడి చేసిన విషయం విదితమే కాగా.. ఆగస్టు 28వ తేదీన నాల్గో చిరుతను బంధించారు అటవీశాఖ అధికారులు.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన దినేష్-శశికళ దంపతులు తమ కూతురు లక్షితతో కలిసి 11వ తేదీన రాత్రి 7.30 ప్రాంతంలో అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. అయితే, లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం వద్దకు చేరుకొనే సరికి అకస్మాత్తుగా ఓ చిరుత చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లింది. ఊహించని ఘటనలో షాక్ తిన్న తల్లిదండ్రులు.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదుచేశారు. రాత్రి సమయం కావడంతో గాలింపు సాధ్యం కాలేదు. అయితే, 12వ తేదీన ఉదయం లక్ష్మీనర్సింహస్వామివారి ఆలయానికి సమీపంలో పోలీసులకు బాలిక మృతదేహం లభ్యమైంది. చిరుత దాడిలోనే చిన్నారి మృతిచెందినట్టు అప్పుడే గుర్తించగా.. ఇప్పుడు ఆ చిన్నారిపై దాడి చేసిన చిరుతను కూడా గుర్తించారు.
హాట్ టాపిక్‌గా మారిన ‘నగరి’ అసమ్మతి నేతల వ్యవహారం.. సీఎంవో నుంచి వెనక్కి..!
చిత్తూరు జిల్లాలో నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి ఆర్కే రోజా ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ నియోజకవర్గంలో రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి.. ఇప్పటికే మంత్రి రోజాపై బహిరంగంగా ఆరోపణలు గుప్పించింది అసమ్మతి వర్గం.. ఏకంగా మీడియా సమావేశాలు పెట్టి.. విమర్శలు చేశారు.. గత ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత రోజా ఎలా మారిపోయారే వారు వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. అయితే, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో నగరి అసమ్మతి నేతల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఏకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికే షాక్ ఇచ్చేలా అసమ్మతి నేతల వ్యవహారం ఉందంటున్నారు. అయితే, సీఎంవో నుంచి పిలుపుతో నగరి నుంచి తాడేపల్లి వెళ్లారు మంత్రి ఆర్కే రోజా అసమ్మతి నేతలు.. అక్కడ రోజంతా పడిగాపులు కాశారట.. కానీ, చివరికి రేపు రావాలని.. మంత్రి రోజా సమక్షంలో మాట్లాడదామని చెప్పారట.. దీంతో.. రోజంతా పడిగాపులు కాసిఉన్న అసమ్మతి నేతలు.. ఆగ్రహంతో వెనక్కి వెళ్లిపోయారట.. వారిలో.. శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి, మురళధర్ రెడ్డి, లక్ష్మీపతి రాజు, అమ్ములు.. ఇతర ఐదు మండలాలకు చెందిన అసమ్మతి నేతలు ఉన్నారట.. అధిష్ఠాన మీదా గౌరవంతో వస్తే.. మళ్లీ మంత్రి రోజాను కూర్చోబెట్టి మాట్లాడిస్తామని చెబుతారా..? అని మండిపడుతున్నారట.. ఇప్పటి వరకు రోజా వద్దు.. జగన్ ముద్దు అంటూ వచ్చిన నేతలు.. ఇప్పుడు మాకు రోజా వద్దు.. మీరు వద్దు అంటూ సీఎంవో నుంచి నగరికి వెళ్లిపోయారట.. అయితే, ఈ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది.. మరోవైపు.. అధిష్ఠానం మాటలు లెక్కచేయకపోవడంతో చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
కర్నూలులో దారుణం.. ఆపరేషన్ థియేటర్‌లో మూగ, చెవిటి బాలుడు నరకయాతన..!
కర్నూలు జీజీహెచ్ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో ఓ ఐదేళ్ల బాలుడు నరకయాతన చూశాడు.. రోజంతా ఆపరేషన్ థియేటర్ లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది ఆ ఐదేళ్ల బాలుడు.. సిబ్బంది నిర్లక్ష్యంతో ఆపరేషన్ థియేటర్ లోపలే ఉండిపోయాడు మూగ, చెవిటి బాలుడు.. రోజంతా ఆకలితో అలమటీంచిపోయాడు.. అయితే, ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న మంచినీళ్లు తాగి కడుపు నింపుకున్నాడు.. రోజు వెళ్లదీశాడు.. చికిత్స కోసం అసుపత్రికి వచ్చాడు ఓర్వకల్ మండలం తిప్పాయిపల్లె కు చెందిన బాలుడు.. అయితే, ఆపరేషన్ థియేటర్ ఉన్న గదిని శుభ్రం చేయడానికి ఆదివారం సిబ్బంది తలుపులు తెరిచిన సమయంలో ఈ మూగ, చెవిటి బాలుడు లోపలికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.. అది గమనించని సిబ్బంది.. వారి పనిముగిసిన తర్వాత.. యథావిథిగా ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసివేశారు.. దీంతో.. రోజంతా అందులోనే నరకయాతన చూశాడు ఆ బాలుడు.. మరుసటి రోజు ఆపరేషన్ థియేటర్ తలుపులు తీయడంతో బాలుడు కనిపించగా కంగుతిన్నారు ఆస్పత్రి సిబ్బంది. అయితే, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆస్పత్రిలో రోగులు, వారి బంధువులు మండిపడుతున్నారు.
జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు..!
తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా మే 13న ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు వారి క్యాండిడేట్స్ లిస్ట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు వారి నియోజకవర్గ వర్గాలలో పెద్ద ఎత్తున మీటింగ్ లు ఏర్పాటుచేసి ఎన్నికల ప్రచారాలను ముందుకు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారానికి ఆర్టీసీ నుండి బుల్లెట్ ప్రూఫ్ బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రచార రథం కోసం పంజాబ్ లోని అంబాల వద్ద గల జేసీబీఎల్ కంపెనీలో వాహనాలను ఆర్టీసీ అధికారులు తయారు చేయించారు. ఈ బస్సులో అత్యాధునికమైన, విలాసవంతమైన సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒకొక్క బుల్లెట్ ప్రూఫ్ బస్సు రూ. 13 కోట్లతో తయారు చేస్తున్నారు. వీటితోపాటు మరో 3 మినీ బస్సులను కూడా సిద్ధం చేశారు అధికారులు. వీటి ఖరీదు దాదాపు 10 కోట్ల వరకు ఉండొచ్చని అంచన. ఇందుకు సంబంధించి ఇప్పటికే విజయవాడకు ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సు.. మరో 3 మినీ బస్సులు వచ్చాయి. వాటిని వైసీపీ పార్టీ ప్రోగ్రాం కమిటీ ఇన్‌చార్జ్ తలశిల రఘురాం ఆర్టీసీ డిపోకు వెళ్లి వాటిని పరిశీలించారు. అయితే ఈ బస్ లు ఎన్నికల కోడ్ రావడానికి ఒక రోజు ముందు నగరానికి వచ్చింది. అంతేకాదు మరో వారం రోజుల్లో ఇంకొక బుల్లెట్ ప్రూఫ్ బస్సు నగరానికి రాబోతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో కారణంగా అద్దె ప్రాతిపాదికన ఆర్టీసీ బస్సులను తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలో కూల్ వెదర్.. అక్కడక్కడ వర్షాలు
హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు వరుణుడు చల్లబడ్డాడు. చల్లటి గాలులు, చిరు జల్లులు హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగించాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఈ చలి మరో మూడు నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉదయం నుంచి ఎండలు మండుతున్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. చింతల్, ఐడీపీఎల్, షాపూర్ నగర్, గ్డిమెట్ల, సూరారం, పటాన్ చెరు, రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్‌లో తేలికపాటి వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది. మరోవైపు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు మండలాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. విర్నపల్లిలో వరి కోత దశలో ఉన్న పంట పొలాలపై ఆకాల వడగళ్ల వర్షానికివరి పంటలు నేల రాలాయి. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో అన్నదాతను వర్షం ఆగం చేసింది. ఆకాలవర్షంతో వరి, మొక్కజొన్న, జొన్న పంటలు పలుచోట్ల నెలకొరిగాయి. ఈదురుగాలులకు మామిడి పంట రాలిపోయింది. పంట చేతికివచ్చే సమయానికి నేలపాలయ్యిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్!
టెస్టు క్రికెట్ రిటైర్మెంట్‌ను శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా వెనక్కి తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు సూచన మేరకు అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అంతేకాదు బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం శ్రీలంక ప్రకటించిన జట్టులో హసరంగాకు చోటు దక్కింది. సోమవారం బంగ్లా సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి సారించేందుకు గతేడాది ఆగస్టులో వనిందు హసరంగా టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. బోర్డు సూచన మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్న హసరంగా.. మళ్లీ రెడ్‌బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. లంక తరఫున హసరంగా 4 టెస్టులు ఆడాడు. 54 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. హసరంగా ఆల్‌రౌండర్ అన్న విషయం తెలిసిందే. స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేస్తాడు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు వనిందు హసరంగా ఎంపిక కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచులకు అతడు దూరం కావాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మార్చి 26 నుంచి, రెండో టెస్ట్ ఏప్రిల్ 3 నుంచి ఆరంభం అవుతాయి. దాంతో సన్‌రైజర్స్ ఆడే ఆరంభ మ్యాచులకు హసరంగా దూరం కానున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ఆరంభం అవుతున్న విషయం తెలిసిందే.
ఏపీలో అల్లు అర్జున్ కొత్త బిజినెస్.. ఏంటో తెలుసా?
సినీ హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటుగా బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి అనే సామెతను సినీ స్టార్స్ గట్టిగానే ఫాలో అవుతున్నారు.. అందుకే చాలా మంది పలు బిజినెస్ లు చేస్తున్నారు.. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సొంతంగా వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నగరాల్లో మల్టీఫ్లెక్స్ లను నిర్మిస్తున్నారు.. ప్రస్తుతం మల్టీప్లెక్స్ లకు డిమాండ్ బాగా ఉండటంతో వీటినుంచి ఆదాయం కూడా అదే రేంజ్ లో వస్తుంది. ఈ క్రమంలో మిగిలిన అగ్ర హీరోల దృష్టి కూడా మల్టీప్లెక్స్ లపై పడుతుంది. తాజాగా అల్లు అర్జున్ కూడా ఏపీలో మల్టీఫ్లెక్స్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాడు.. వైజాగ్ లో మల్టీ ఫ్లెక్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు.. ఇకపోతే వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన త్వరలో జరగబోతోంది. ఇక ఈ మాల్ ను అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్తో కలిసి తన బ్రాండ్ AAA సినిమాస్ ను స్టార్ట్ చేయబోతున్నారు.. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు..
జపాన్ లో RRR సినిమా రీరిలీజ్.. రాజమౌళి ఎమోషనల్ పోస్ట్..
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి..అందుకు త్రిపుల్ ఆర్ సినిమా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.. సినిమా హిట్ అవ్వడంతో పాటుగా ఆస్కార్ కు కూడా ఎంపిక అయ్యింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటించారు.. 2022లో రిలీజయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి సక్సెస్ ను అందుకొని తెలుగు సినీ చరిత్రను తిరగరాసింది.. ఇప్పటికి కొన్ని దేశాల్లో సినిమా క్రేజ్ తగ్గలేదు.. ఈ సినిమాను అన్ని దేశాల్లో రిలీజ్ చేశారు.. జపాన్ లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ జనాలను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో కలిసి మరీ వెళ్లి RRR సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసారు.. అంతగా సినిమాకు జపాన్ ప్రజలు కనెక్ట్ అయ్యారు.. ఆ సినిమా పై మాత్రమే కాదు.. సినిమాలో నటించి హీరోల పై కూడా అభిమానాన్ని పెంచుకున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా జపాన్ లో RRR సినిమాని రీ రిలీజ్ చేశారు. దీంతో రాజమౌళి మరోసారి జపాన్ కి వెళ్లారు.. ప్రతి థియేటర్ హౌస్ ఫుల్ అయ్యింది.. రాజమౌళిని చూసిన ఫ్యాన్స్ సంతోషంలో మునుగిపోయారు. ఇక ఈ భామ్మ అయితే రాజమౌళికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది.. అప్పుడు బామ్మ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆర్గామి క్రేన్స్ అనే గిఫ్ట్ తమకి ఇష్టమైన వాళ్ళ కోసం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని తయారుచేస్తారు.. అలా ఈ బామ్మ జక్కన్నకు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.. ఇకపోతే జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు..
గోవాకు ఎన్టీఆర్.. న్యూ లుక్ అదుర్స్..!
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు.. అదే జోష్ తో ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ గోవాకు వెళ్లాడు.. ఆ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. దేవర సినిమాలోని కీలక సన్నీవేశాలను, జాన్వీ – ఎన్టీఆర్ ల పై ఒక అద్భుతమైన సాంగ్ ను అక్కడ చిత్రీకరించబోతున్నారట.. అందుకోసమే ఎన్టీఆర్ గోవాకు బయలుదేరారు.. తన ఫిట్నెస్ ట్రైనర్ తో కలిసి ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.. ఆయన లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. టీ షర్ట్, జీన్స్ ధరించి ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు.. ఆ ఫోటోలలో ఎన్టీఆర్ బరువు తగ్గినట్లు కనిపిస్తున్నారు.. ఆ ఫోటోలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు… దేవర సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించునున్నారు. రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారు. దేవర చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్-జాన్వీ కాంబినేషన్ పై హైప్ నెలకొంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అనుకున్న టైం లో విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమాతో ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నారు.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నారు..