AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల ముందుగానే ముగియనున్నాయి.. నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ఆ తర్వాత జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.. అంటే, ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని.. ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఉంటుందని ప్రకటించారు.. కానీ, ఇప్పుడు మూడు రోజులు ముందుగానే.. అంటే, ఈ నెల 27తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.. ఇక, ఈ నెల 22వ తేదీన అసెంబ్లీలో వ్యవసాయం, 23న శాంతిభద్రతలు, 24న ప్రభుత్వ బిజినెస్‌పై చర్చ సాగనుండగా.. 25న ఆరోగ్యంపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.. మరోవైపు, 26న లాజిస్టిక్స్, ఉపాధి కల్పన, పరిశ్రమలపై చర్చ జరుగుతుంది.. 27న సూపర్ సిక్స్ అమలుపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.. చివరి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగింపు సందేశం ఇవ్వనున్నారు.. కాగా, కూటమి ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతుండగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న విషయం విదితమే.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.. మరోవైపు, శాసనమండలిలో వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది వైసీపీ..