మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండే పరిస్థితి లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు చేతులెత్తి నమస్కారం పెట్టి.. రాష్ట్రం కోసం రావాలని కోరాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురం నుంచి గతంలోనే పోటీ చేయాలని చాలా మంది ఆహ్వానించారు.. కానీ, ఇప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాన్నారు. 2019 లోనే పోటీ చేయమంటే నేను ఆలోచించాను.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే పిఠాపురం ప్రత్యేకమైనది అని ఆయన చెప్పుకొచ్చారు. పిఠాపురంలో కులాల ఐక్యత జరగాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
టీడీపీ అంటే మా ప్రాణం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ తెలుగు దేశం పార్టీ కోసమే ప్రాణాలు వదిలారు అని కోడెల శివరాం తెలిపారు. పార్టీని విడిపోవాలని ఆలోచన నాకు ఎప్పుడూ లేదు.. కోడెల పేరు వినపడకూడదని ఆలోచనతో కొంత మంది నియోజకవర్గంలో మా మీద దుష్ప్రచారం చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు.
కేంద్ర మంత్రులు, ఉపముఖ్యమంత్రులు హోదాలు అనుభవించి మీ సొంత ఊర్లకు రోడ్లు వేయలేని మీరా అభివృద్ధి గురించి మాట్లాడేది అని విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని సినిమా డైలాగ్ కొట్టి యువతను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్సాహపరిచారు.
జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం నాడు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
తిరుమలలో రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
నెల్లూరు సిటీ పరిధిలోని జండా వీధి.. చిన్న బజార్ ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి నారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు పాత నగరంలో వర్షపు నీరు రాకుండా ఉండేందుకు పలు చర్యలను గతంలో చేపట్టామన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 16.83లక్షల ఓటర్లు ఉన్నారు అని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం.. 0866-2570051కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.