Off The Record: పొలిటికల్ కంపు కొడుతున్న అహోబిలం, తెలుగుదేశం నేతల హస్తం ఉందన్న గుసగుసలు
- పొలిటికల్ కంపు కొడుతున్న అహోబిలం..
- అడ్డగోలు వసూళ్ళు, కిరాణా షాపుల్లో మద్యం..
- నారసింహుడి భక్తుల నిలువు దోపిడీ..
- క్షేత్రంలో ఎటు చూసినా బాదుడే బాదుడు..
- తెలుగుదేశం నేతల హస్తం ఉందన్న గుసగుసలు..
- ఆళ్ళగడ్డ ముఖ్య నేతలకు మామూళ్ళు ఇచ్చుకోవాలన్న టాక్..
- కారు ఎంటర్ అవ్వాలంటే రూ.150 టోల్ ఫీజు..
- శ్రీశైలంలో రూ.100, మహానందిలో 80, మంత్రాలయంలో 50..
- ఎందుకలా అంటే ఆళ్ళగడ్డ ట్యాక్స్ అన్న సమాధానం..
- అహోబిలంలో ఒక్క టెంకాయ రూ. 50..
- స్వామికి సమర్పించే తలనీలాల గోల్‌మాల్?..
- అహోబిలం కిరాణా షాపుల్లో మద్యం అమ్మకాలు?..
- అహోబిలం టెండర్స్ వెనక అదృశ్య శక్తులు?..
- అరాచకాలు చేసే వాళ్ళ వెనక లోకల్ టీడీపీ పెద్ద తలకాయలు?..
- చర్యలు తీసుకోకుంటే ఓవరాల్‌గా టీడీపీ ఇమేజ్ డ్యామేజ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆ ప్రముఖ పుణ్య క్షేత్రంలో అరాచకాలు, అడ్డగోలుతనం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేవుడికి నిలువు దోపిడీ ఇచ్చే ఛాన్స్ లేకుండా… రాజకీయ నాయకులే ఆ పని చేసేస్తున్నారు. యుగాల ప్రాశస్త్యం ఉన్న క్షేత్రంలో చివరికి కిరాణా షాపుల్లో మద్యం అమ్ముతున్నారు. దాని వెనక టీడీపీ నేతల హస్తం ఉందన్న ఆరోపణల్లో నిజమెంత? వేళ్ళన్నీ ఎటువైపు చూపిస్తున్నాయి?
Also Read
నంద్యాల జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాశస్త్యం, పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పుణ్య క్షేత్రంలో ఇప్పుడు పొలిటికల్ కంపు కొడుతోంది. దాన్ని మామూలుగా కంపు అనేకంటే… గబ్బులేచిపోతోందని అనడం చాలా కరెక్ట్ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వామివారి భక్తులు. అడ్డగోలు వసూళ్ళ నుంచి కిరాణా షాపుల్లో మద్యం అమ్మకాల దాకా… అంతా విచ్చలవిడి అయిపోయిందని, వసూళ్ళలో కొంత భాగం ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కొందరికి అందుతోందన్న ప్రచారం ఇంకా కలకలం రేపుతోంది. ఈ నారసింహ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. దట్టమైన నల్లమల ఆటవీప్రాంతంలో ఉంది. భక్తి పారవశ్యంతో పాటు ప్రకృతి ఆస్వాదన కూడా ఇక్కడి ప్రత్యేకం.
Read Also: Tata Motors 2026 Cars: కొత్త సంవత్సరంలో టాటా మోటార్స్ లాంచ్ చేసే కార్లు ఇవే!
అదంతా ఒక వైపు అయితే.. మరోవైపు మాత్రం నారసింహుడి దర్శనానికి వచ్చే భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఈ పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టడంతోనే బాదుడు మొదలవుతుంది. టోల్ గేటు ఫీజు, టెంకాయ ధరలు, తలనీలాలు, పార్కింగ్.. ఇలా ఒకటేంటి.. ఎటు చూసినా.. వాయింపుడేనని ఆవేదనగా చెబుతున్నారు భక్తులు. ఈ దోపిడీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందని, దీని వెనుక కొందరు తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏంటీ అడ్డగోలు వసూళ్లు, ధరలు అని అడిగితే… ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు మామూళ్ళు ఇచ్చుకోవాలి, వాళ్ళకు ఇవ్వాల్సింది పోగా మేం కూడా బతకాలంటే…ఆ మాత్రం రేట్లు ఉండాలి కదా అని అంటున్నారట. అహోబిలం వెళ్లిన భక్తులు మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేని రేట్లు ఇక్కడే ఉన్నాయంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఇక్కడికి కారు ఎంటర్ కావాలంటే.. 150 రూపాయల టోల్ ఫీజు కట్టాల్సిందే. కారులో వెళ్ళేవాడికి 150 ఎక్కువా అంటూ రివర్స్ ఆలోచించవద్దు. మిగతా చోట్లతో పోలిస్తే ఇది ఎక్కువేనంటున్నారు భక్తులు.
శ్రీశైలంలో కారుకు టోల్ ఫీజు 100 రూపాయలు. మహానందిలో 80, మంత్రాలయంలో 50 రూపాయలు మాత్రమే. ఇతర పుణ్య క్షేత్రాల్లో పెద్ద బస్సులకు వసూలు చేస్తున్న టోల్ ఫీజు కంటే అహోబిలం లో కార్లకే ఎక్కువన్నది ఇక్కడి వాళ్ళ మాట. ఎందుకలా అంటే.. ఆళ్ళగడ్డ ట్యాక్స్ అన్నది ఆన్సర్. ఇక టెంకాయ ధర అదిరిపోతుందట అహోబిలంలో. శ్రీశైలంలో టెంకాయ ధర 25 రూపాయలు. మహానందిలో 40, మంత్రాలయంలో రెండు టెంకాయలు, కలకండ, అగర్‌బత్తి అన్నీ కలిపి వందకు అమ్ముతున్నారు. కానీ… అహోబిలంలో మాత్రం ఒక్క టెంకాయే 50 రూపాయలు. ఇక ఇక్కడ భక్తితో స్వామి వారికి సమర్పిస్తే తలనీలాల విషయంలోనూ గోల్‌మాల్ జరుగుతోందట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇంతకు మించిన అరాచకం ఇంకోటి జరుగుతోంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలోని కిరాణా షాపుల్లో మద్యం అమ్ముతున్నారట.
Read Also: Bangladesh: బంగ్లా జాతీయ కవి పక్కనే రాడికల్ హాది అంత్యక్రియలు.. ఎందుకు ఇలా చేశారు?
సాధారణంగా బెల్ట్ షాపులు చూసి ఉంటారుగానీ.. ఇక్కడ మాత్రం కిరాణా మద్యం స్పెషల్ అంటూ సెటైర్స్ వేస్తున్నారు స్థానికులు. ఇదంతా చూస్తూ.. వింటూ భక్తులు మాత్రం హే.. నారసింహా.. ఎక్కడున్నావయ్యా.. జరుగుతున్న పాపాల్ని చూస్తున్నావా? ఈ దరిద్రుల్ని శిక్షించలేవా అంటూ వేడుకుంటున్నారు. అసలు అహోబిలంలో ఏ టెండర్ దక్కాలన్నా.. కొన్ని అదృశ్య శక్తుల ఆశీస్సులు ఉండాలట. ఆ చేతులు సైగలు చేయనిదే ఇక్కడ పిట్ట పురుగు కదలడానికి వీల్లేదని చెప్పుకుంటున్నారు. ఈ అరాచకాల వెనక లోకల్ టీడీపీ నాయకులు ఉన్నారని, వాళ్ళ వెనక కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయన్నది అహోబిలం టాక్. స్వామికి నిలువు దోపిడీ ఇవ్వాలనుకునే వాళ్లకు ఆ ఛాన్స్ లేకుండా వీళ్ళే ఆ పని చేస్తున్నారన్న సెటైర్స్ సైతం వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాల్ని ఇలాగే వదిలేస్తే… రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వచ్చే చోట రచ్చ పెరిగి తెలుగుదేశం పార్టీ మీద వోవరాల్‌గా ఎఫెక్ట్ పడుతుందన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. పార్టీ, ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి ఆ అదృశ్య హస్తాలను పెడ రెక్కలు విరిచి కట్టకుంటే… ఇమేజ్ బీభత్సంగా డ్యామేజ్ అవుతుందని మాట్లాడుకుంటున్నారు అహోబిలంలో.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!